తెలంగాణ

బావిలో 12 గంటల నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, ఏప్రిల్ 20: ఎప్పుడు పడ్డాడో...? ఎలా పడ్డాడో...? ఎవరికీ తెలియదు. కానీ బావిలోపడ్డ ఆ యువకుడు రాత్రంతా గాయా లతో నరకాన్ని అనుభవిస్తూ దాదాపు 12 గంట ల తర్వాత పోలీసుల సహకారంతో బయటికి రాగలిగాడు. అతడిని చూసి అయ్యో పాపం ఎక్కడి వాడో ఇక్కడి కొచ్చి ఇలాంటి విపత్కర పరిస్దితిని ఎదుర్కొన్నాడంటూ పలువురు వాపోయారు. శుక్రవారం వెలుగు చూసిన ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రానికి చెందిన మోహ న్ దాదాపు ఏడాదిన్నర క్రితంజీవ నాధారం నిమిత్తం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ బేకరీ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న ఆయన గురువారం సాయంత్రం దుకాణం నుండి బయటికెళ్ళి తుంగతుర్తి గ్రామ పొలి మేరల్లోని 8కండెల లోతులో ఉన్న ఓ వ్యవ సాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. కాపాడాలంటూ ఎంత అరిచినా రాత్రి సమ యం కావడంతో జనాలు అక్కడ లేకపో వడంతో నరకయాతన పడుతూ అందులోనే గడిపాడు. మోహన్‌కు చేయి విరగడంతో పాటు శరీరమంతా గాయాల య్యాయి. చివరి కి శుక్రవారం ఉదయం అటుగా వెళ్ళే జనం అతడిని గుర్తించి పరిస్థితిని గమనించి పోలీసు లకు సమాచారమిచ్చారు.
ఎస్‌ఐ బాలు నాయక్ క్రేన్‌ని తెప్పించి తాడు ద్వారా ఆ యువకుడిని బయటికి తీసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అదృష్టం ఏంటంటే ఈత రాని మోహన్‌కి బావిలో కొద్దిపాటి నీరే ఉండటంతో బతికి బయటపడగలిగారు. కాగా ఎస్‌ఐ బాలు నాయక్ దీనిపై పూర్తి విచారణ చేస్తున్నారు. మోహన్‌ను ఎవరైనా తీసుకెళ్ళి బావిలో తోశారా..? లేక ఆయనే ప్రమాదవశా త్తు కాలు జారి అందులోపడ్డారా..? అసలు మోహన్ ఆ సమయంలోఅటుగా ఎందుకు వెళ్ళారు..? తదితర ప్రశ్నలపై విచారణ కొనసా గుతోంది.

చిత్రం..క్రేన్ సహాయంతో తాడు ద్వారా మోహన్‌ను బయటకు తీస్తున్న దృశ్యం