వరంగల్

త్వరితగతిన ట్యాంకులు నిర్మించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ ఏప్రిల్ 20: మిషన్ భగీరథ ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రభుత్వ లక్ష్యం కార్యరూపం దాల్చేందుకు గ్రామాల్లో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను కోరారు. శుక్రవారం కలెక్టర్ మినీకాన్ఫరెన్స్ హాలులో జరిగిన మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్లు తగు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 30 శాతం పైప్‌లైన్ పనులు పూర్తి కావడం జరిగిందని వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం కొన్ని చోట్ల ప్రారంభ దశలోనే ఉండగా కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి కావడం జరిగిందని త్వరితగతిన నిర్మాణం పూర్తి కావడం వల్ల అనుకున్న లక్ష్యానికి తాగునీరు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇందుకు కాంట్రాక్టర్లే సాంకేతికపరమైన సమస్యలు, నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా తదితర విషయంలో సమస్యలు ఎదురైతే సంబంధిత ఎస్‌ఈఈ నేరుగా తమకు తెలియజేయాలని కాంట్రాక్టర్లకు ఆమె సూచించారు. మే నెలాఖరు నాటికి నిర్మాణంలో ఉన్న ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు పూర్తి దశలో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. నాగార్జున ఆర్ కన్సల్ట్టేషన్ ద్వారా కమలాపూర్ మండలం గొల్లపల్లి, నెరెళ్ళ పేరుకపల్లి గ్రామంలో మూడు ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల నిర్మాణం అనుకున్న అగ్రిమెంట్‌కు ముందుగానే పూర్తి చేసిన కంట్రాక్టర్ నాగార్జున రెడ్డి, డిఈ శే్వత, ఏఈ మధులను ఆమె అభినందించారు. వారిని స్పూర్తిగా తీసుకొని మిగిలిన గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు పూర్తి చేయాలని ఆమె సూచించారు. జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంట్రా విలేజ్ కింద 66.17 కోట్ల రూపాయల వ్యయంతో 161 ఓవర్ హెడ్ ట్యాంక్‌లు మరియు 352 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులు చేసి 25 మంది కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని అన్నారు. మిగతా ఒవర్‌హెడ్ ట్యాంకులు, పైప్ లైన్ పనులు వివిధ స్థాయిలలో ఉన్నాయని మే నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి అయితే జిల్లాలోని 205 హ్యబిటేషన్లతో ఇంట్రా విలేజ్ పనులు పూర్తి చేయడం ద్వారా మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు అందించేందుకు చర్యలు తీసుకొంటామని కలెక్టర్ అన్నారు. నాగార్జున (ఆర్) కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి ఇచ్చిన మూడు ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు పనులు నిర్ణీత కాలానికి ముందుగానే పూర్తిచేసి అందించడం జరిగిందని అలాంటి కంట్రాక్టర్‌ను కలెక్టర్ ప్రశంసించారు. మిగతా కంట్రాక్టర్స్ వారిని ఆదర్శంగా తీసుకుని సకాలంలో నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మే మొదటి వారానికి నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా అనుకున్న సమయానికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందని ఇప్పటికే తాగునీటి సమస్య తలెత్తకుండా, ముఖ్యంగా వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆమె ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యుఎస్ మల్లేష్‌ను అదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యుఎస్ మల్లేశం, డిఈ శే్వత, మధు, కాంట్రాక్టర్లు చంద్రశేఖర్, సుధాకర్, నాగార్జున్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యనారాయణ, ఉపేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.