రాష్ట్రీయం

అవినీతి నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పట్టిసీమ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని రుజువులతో సహా సీబీఐకి 15 రోజుల్లో ఫిర్యాదు చేయనున్నట్టు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ అవినీతిపై సాక్ష్యాలు ఉంటే సీబీఐకి ఫిర్యాదు చేసుకోమని టీడీపీ నేతలు అంటున్నారని, వారి ముచ్చట తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పట్టిసీమలో నూటికి నూరు శాతం అవినీతి జరిగిందని అన్నారు. 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు చేసిన దీక్షలో పసలేదని, చెప్పిందే పదేపదే చెపుతూ జనానికి విసుగు తెప్పిస్తున్న ఆయన ఇకపై తనతో పాటు ఒక ఆర్కెస్ట్రాను కూడా తీసుకువెళితే బాగుంటుందని రాజు ఎద్దేవా చేశారు. ఈనెల 30న తిరుపతిలో చంద్రబాబు బహిరంగ సభ పెట్టడానికి ఇంకెంత ఖర్చు చేస్తారోనని అన్నారు. రాష్ట్రానికి
హోదా అక్కర్లేదని, ప్యాకేజీ సరిపోతుందని చంద్రబాబు కేంద్రానికి చెప్పడం నిజంకాదా? అని ప్రశ్నించారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్భ్రావృద్ధికి 16,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంటే, చంద్రబాబు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీకి ఈరోజు ఉన్న పరిస్థితి 2019 ఎన్నికల నాటికి ఉండదని విష్ణుకుమార్ రాజు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సుమారు 20 అసెంబ్లీ సీట్లను, నాలుగు పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుందని అన్నారు. మే 15 తరువాత టీడీపీ నుంచి కొంతమంది నాయకులు, ఇతర పార్టీల్లోకి వలస వెళ్లనున్నారని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయడం వలనే తమ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయని అన్నారు.