Others

పుస్తకం ఒక సముద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకం ఒక సముద్రం
సముద్రాన్ని చేతిలోకి తీసుకుంటే
విశ్వం లోతులు తెలుస్తాయి
విశ్వం లోతుల్ని మించిన
నీ లోపలి లోతులు కూడా మెరుస్తాయి
నవ్వుల లోకాలు పువ్వుల శోకాలు
హిమాలయాల ఎత్తులు ఏలికల జిత్తులు
నవ రసాల పేటిక పుస్తకం
దివ్య కిరీటంతో అభిషిక్తం మస్తకం

మొదటి అట్ట జననం, చివరి అట్ట మరణం
రెండు అట్టల మధ్య ప్రవహించే
జీవన సారం పుస్తకం
బతకటమంటే పుస్తకాన్ని చదవటం
పుస్తకాన్ని చదవటమంటే
సార్థకంగా జీవించటం
పుస్తకాన్ని తెరవటమంటే
ఇంట్లో ఉన్నా కోట్ల జనాల్లోకి వెళ్లటమే
కాలు కదలకుండానే
కమనీయ ప్రపంచాన్ని చుట్టిరావటమే
పుస్తకమంటే ఒక యుద్ధ్భూమి దర్శనం
మానవులు గెలిచి తీరటం..
దానవులు ఓడిపోవటం
పుస్తకమంటే కల్పతరువు
వివిధ కాంతి ప్రసారాల గురువు
నీకు కాంతి వస్త్రాలు అందించటానికి
నిన్ను దీప ద్వీపాలకు చేర్చే
నావలు పుస్తకాలు
నీకు విజయ గమ్యాలు చేర్చటానికి
నీ మనసు నెక్కించుకొని పరిగెత్తే
జవనాశ్వాలు పుస్తకాలు
ఒక్కొక్క అక్షరం ఒక మణి
పుస్తకం అంటే
మనసు మెడను అలంకరించే
మహామహా మణిహారం
పుస్తకంలో కోట్ల ప్రాణులు
పుస్తకమే కోట్ల ప్రాణాలు

- డాక్టర్ రావి రంగారావు, 9247581825