Others

మచ్చుకు రెండు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒ ప్రతివారికీ ఓ సిద్ధాంతం ఉంటుంది. ఎవరి సిద్ధాంతం వారికి గొప్పదే. మన సిద్ధాంతాన్ని ఇష్టంతో ప్రేమించాలి. ఇతరుల సిద్ధాంతాలను గౌరవించాలి. కానీ మార్క్సిస్ట్ మత్తుమందు మదినిండా నింపుకొన్న ఈ సాహిత్యవేత్తలకు ఎప్పుడూ హ్రస్వదృష్టే. ఎప్పుడూ ఒక మతంలోని లోపాలను ఎత్తిచూపుతూ, ఇంకోమతాన్ని బుజ్జగించడమే వీరికి వీరలౌకికవాదం. 27 ఫిబ్రవరి 2002 నాడు గుజరాత్‌లోని గోద్రాలో 59 మంది కరసేవకులు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో మతోన్మాదుల చేతిలో తగులబెట్టబడ్డారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లను గురించి సూడో సెక్యులర్ మీడియా ఐక్యరాజ్య సమితివరకు భారతదేశాన్ని, హిందువులను బజారుకీడ్చింది. ఈ సంఘటనలు జరగడం దురదృష్టకరం. కానీ పాక్షిక దృష్టితో కవులు కూడా ‘మతోన్మాదాన్ని’ ఖండించకుండా కేవలం మెజారిటీ ప్రజలను బోను ఎక్కించారు. ఆ సమయంలో ‘గుజరాత్ గాయం’ పేరుతో తెలుగు కవులు తమ హర్యాలీ కవిత్వాన్ని ఎర్ర సిరాతో పులుముకొని శివాలెత్తారు. అందులో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సాహిత్య అకాడమీని ఆడిస్తున్న డా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి హిందువుల రథయాత్రనే మహా నేరం అన్నట్లు కవిత్వం ఒలకబోసాడు.
మనుషుల్ని మనుషులుగా గాక
మనుషుల్ని ఇటుకలుగా జేసి
దేశమంతా రథమై ఊరేగినపుడు
నవ్విన నవ్వు ఫలితమే ఈ ఏడుపు
...........................
దేశమంటే మనుషులు కాదని
దేశమంటే విగ్రహాలని
ప్రజలంటే పాదుకలని
మొండిగోడలెక్కి చిందులేసిన ఫలితం
కన్నీళ్లు కాక మరేమవుతుంది?
(గుజరాత్ గాయం- పు.100)
ఇలాంటి వక్రదృష్టి, పక్షపాత బుద్ధిగలవారు అకాడమీ గద్దెలపై కూర్చొంటే అన్ని వర్గాలకు సమన్యాయం ఎలా అందుతుంది?
* * *
ఒ ‘‘రావణుడి చెల్లెలని తెలియకపోతే రామలక్ష్మణులు శూర్పణఖనట్లా చేసేవారు కాదు. రావణుని రెచ్చగొట్టాలనే రాముడి అభిమతం. అతనితో కయ్యానికి కారణం కోసం వెతుకుతున్న రాముడి అనే్వషణ శూర్పణఖవల్ల నెరవేరింది’’ -
(ఓల్గా, విముక్త, పు.19)
శూర్పణఖ రామలక్ష్మణులను కలిసినపుడు సీతాపహరణమే జరగలేదు. అపుడే రావణుడితో రాముడు కయ్యానికి కాలుదువ్వుతున్నాడట. ‘ఓల్గా రామాయణం’ వింటే వాల్మీకి మహర్షి ఆత్మహత్య చేసుకొన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. త్రిపురనేని రామస్వామి చౌదరి, నార్ల వెంకటేశ్వరరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న ఈ సరికొత్త రామాయణాన్ని డా ఆవుల మంజులత, డా జి.యోహానుబాబు, డా కె.రామచంద్రమూర్తి జ్యూరీత్రయం అకాడమీ అవార్డుకు ఎంపిక చేసినందుకు హాట్సాఫ్!
భారతీయతను భ్రష్టుపట్టించే సాహిత్యాన్ని ఈ జాతికి అందించే సాహితీ సుగంధాలను ప్రజల సొమ్ముతో నడిచే కేంద్ర సాహిత్య అకాడమీ నిర్విఘ్నంగా చేస్తూంటే మనం కళ్లప్పగించి చూడడం తప్ప ఇంకేం చేయలేం.