Others

కొత్త వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనం భయపెట్టేంత వౌనం
చిరు శబ్దం సైతం లేని నిశ్శబ్దం
చిన్నపిల్లల అలికిడి లేక
ఇల్లు ఇల్లులా లేదు
మేము మేములా లేము

చిన్న మనుమరాండ్లిద్దరు
ఎండకాలం వాళ్లమ్మ దగ్గరికి
ముసాఫిర్‌గా పోయండ్రు
పోస్ట్ రోజూ తీసుకునే
మనుమరాలి ఆనవాలు లేక
పిల్లలు లేరా అని
పోస్టుమాన్ ఆరా తీస్తున్నాడు

వాళ్ల అమ్మమ్మ
‘విన్నూ! ఏం సదురుడు అల్లరి’ అంటే
‘పిల్లలు అట్లనే చేస్తరు
నీకేం బాదైతుంది అమ్మమ్మా’ అంటుంది

‘అరేయ్!
పుస్తకాలు ఇప్పుడే వచ్చినై
చింపకురా రాయకురా’ కోపంగా చెప్పితే
‘నేనేం పాడు చెయ్యలా
పుస్తకాలతో ఆడుకుంటున్నా’ జవాబు
రెండు రోజులకే
మా మనుమరాలు మమ్ముల్ని
తన యాదులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది

పుస్తకాలు చదువుతరనే
నా ఇన్నినాళ్ల ఎరుకకు
ఆశ్చర్యంగా కొత్త చూపును అద్దుతుంది

ఇప్పుడు ఇల్లు ఇల్లులా
ఎట్లుంటది
ఇప్పుడు మేము మేములా
ఎట్లుంటం చెప్పుండ్రి