అమ్మాయి నచ్చింది ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. సాయిరోనక్, నిశాంత్ హీరోలుగా... ఇషానియా, రితిక హీరోయిన్లుగా అమ్మాయి నచ్చింది పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యనారాయణ ద్వారపూడి (పెళ్లికానిప్రసాద్ చిత్రం ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అజయ్‌కుమార్ క్లాప్ కొట్టగా, చంద్ర కెమెరా స్విచ్చాన్‌చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గతంలో పలువురు ప్రముఖ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలను మా సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. బిచ్చగాడు వంటి భారీ విజయవంతమైన చిత్రం తర్వాత కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈనెలలో ఐదు చిత్రాలను మొదలుపెడుతున్నాం. ఆ ఐదు చిత్రాలలో ఇది తొలి చిత్రం. దర్శకుడు సత్యనారాయణ ద్వారపూడి చెప్పిన కథ నచ్చి, ఈ చిత్రాన్ని తీస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరింపజేస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.
అతిథి అజయ్‌కుమార్ మాట్లాడుతూ, చాలా మంచి టైటిల్ ఇదని, చిత్ర బృందంచేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు సత్యనారాయణ ద్వారపూడి మాట్లాడుతూ.. వినోదంతో కూడుకున్న ఫీల్‌గుడ్ ప్రేమకథాచిత్రమిది. నలుగురు హీరోహీరోయిన్లతో పాటు వెనె్నలకిషోర్ పాత్ర కూడా ఈ చిత్రంలో కీలకంగా ఉంటుంది. అలా ఐదుమంది మధ్యనసాగే ఈ ప్రేమకథలో ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంటుంది. అదేంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేసిన తర్వాత కాశ్మీర్‌లో 40 రోజులపాటు చిత్రీకరణ జరుపుతాం. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో వారం రోజులపాటు చిత్రీకరణ జరపడంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది అని చెప్పారు. సంగీత దర్శకుడు మంత్ర ఆనంద్ మాట్లాడుతూ సంగీత భరిత ప్రేమకథా చిత్రమిదని అన్నారు. సాధారణంగా ప్రేమకథా చిత్రాలలో సంగీతానికి ఎంతో అవకాశం ఉంటుందని, ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందేనని అన్నారు. ఇందులో ఆరు పాటలున్నాయని, వాటి రికార్డింగ్ కూడా పూర్తయిందని చెప్పారు. హీరోలు సాయిరోనక్, నిశాంత్, హీరోయిన్లు ఇషానియా, రితిక తదితరులు మాట్లాడుతూ నటనకు బాగా అవకాశంఉన్న పాత్రలను తమకు ఇచ్చినందుకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వెనె్నలకిషోర్, అనంత్, సత్య, అశోక్‌కుమార్, సుదర్శన్, మధునందన్, సురేఖవాణి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: మంత్ర ఆనంద్, పాటలు: మూర్తి దేవగుప్తాపు, మంత్ర ఆనంద్, మధుపాలక్, ఫొటోగ్రఫీ: రాహుల్ మాచినేని, ఎడిటింగ్: రామారావు, ఆర్ట్: వెంకట్ ఆరె, సమర్పణ: చదలవాడ బ్రదర్స్, నిర్మాత: చదలవాడ పద్మావతి, కథ, మాటల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యనారాయణ ద్వారపూడి.