మెయిన్ ఫీచర్

సర్వేలు చెబుతున్న నిజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు నిరక్షరాస్యత తగ్గింది. అక్షరాస్యత పెరిగింది.
ఇంతకు ముందులాగా గంపెడు పిల్లలు కాక ఇద్దరో ముగ్గురో పిల్లలున్నారు.
అమ్మనాన్న చదువుకుని ఉద్యోగాలు చేసేవారున్నారు.
అత్యుత్తమమైన కార్పోరేటు స్కూల్స్‌లో ఆర్థికంగా బాగా మెరుగైన స్థితిలో ఉన్నవారితో చెలిమి చేసేవారున్నారు.
డిగ్రీలు పొందినవారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువైయ్యారు.
చాలామంది మంచి మంచి కార్పోరేటు స్కూల్స్‌లో చదువుతున్నారు. బోలెడన్నీ డిగ్రీలు కూడా సంపాదించేస్తున్నారు. ఏ చదువులోనైనా అందరినీ ఆశ్చర్య పడేట్లుగా 99లేక 100 శాతం మార్కులు తెచ్చుకుంటున్నారు.
కాని, దురాచారాలు, అనాచారాలు ఎక్కువవౌయ్యాయి.
ఇంతకు ముందుకాలంలో ఇంతగా చూడని సామూహిక అత్యాచారాలు ఎక్కువవైయ్యాయి.
ఎందుకిలా అని సర్వేలు నిర్వహిస్తే తెలిసిన నిజాలు
విలువలతో కూడిన చదువులు లేకపోవడం అన్నదే కారణం
విలువలంటే...
తమ పిల్లలకు చిన్న అసౌకర్యం కలిగించినా స్కూల్ యజమాన్యంతో తల్లిదండ్రులు పోట్లాట మేము డబ్బు కట్తుంటే మీరు అసౌకర్యం కల్పించడం ఏమిటని,
మీకు ఎంతైనా డబ్బు ఇస్తాం. స్పెషల్ క్లాసులు పెట్టండి. కాని మా వాడు అందరికన్నా ఫస్టు ర్యాంకు మాత్రమే తెచ్చుకోవాలి అని నిబంధన.
తోటి పిల్లలతో సరియైన నడవడి లేకపోతే తల్లిదండ్రుల జోక్యం చేసుకోవడం అది మా పిల్లలను ఎవరైనా ఏదైనా అంటే వేరే స్కూల్‌లో చేర్పిస్తాం జాగ్రత్త అంటూ యజమాన్యాలు హెచ్చరించడం.
పిల్లలు టీచర్లు చెప్పింది వినకపోవడం, చదువమన్నది చదవక పోవడం చేస్తే టీచర్లు కాస్త కోప్పడితే మాకు ఏమైనా ఊరికినే చదువు చెప్తున్నారా.. ఈరోజు చదవకపోతే రేపు చదువుతాడు కదా మధ్యలో మీకు కోపం ఏమిటి ఎందుకు కసురుతారు.. ఇట్లాంటి వారిని జైల్లో పెట్టాలి అని పిల్లల ముందే టీచర్లును తిట్టడం. వారికి వార్నింగులు ఇవ్వడం
పిల్లలు వారి తల్లిదండ్రులు చేసే ఉద్యోగాలు , వారికున్న ఆర్థిక సంపత్తి ని చూపుతూ ఇతర పిల్లలతో గొడవ పడడం, వారిని తక్కువగా చూడడం లాంటివి చూసినపుడు టీచర్లు కాని, తల్లిదండ్రులు కాని వారు చేసేది తప్పు అని చెప్పకపోవడం
నేటి విద్య కేవలం వారికి డిగ్రీలు తెస్తోంది కాని వినయం, సంస్కారాలు నేర్పడం లేదు. కేవలం సమ్మర్ కోచింగ్స్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సులకు పంపండి అక్కడ కూడా తమ ఆధిక్యతకు భంగం రానివ్వకుండా చూడడం, నలుగురితో కలసి కాక పదిమందిలో ఉన్నా తానుప్రత్యేకంగా ఉండాలనుకోవడం, ఇతరులకు సాయం చేసే గుణానే్న నేర్పించక పోవడం, ఒకవేళ ఏదైనా సాయం చేస్తే అది కూడా ఓ గొప్పగుణం అని అహంకారం పెంచడం లాంటివి చేయడం వల్లే నేటి చదువులు విలువలు లేకుండా పోతున్నాయి. అందువల్లే ఎక్కడ చూసినా అమానుషమైన పనులు చేసేవారు ఎక్కువ అవుతున్నారు. వీటిని ఆపి అందరూ సర్వసమానంగా సోదర భావంతో లింగ వివక్షత లేకుండా ఉండాలంటే రాబోయే తరాలకు కనీసం ఇప్పుడైనా విలువలు నేర్పాలి.

-నిర్మల