రాష్ట్రీయం

కాంగ్రెస్‌కంటే గలీజు దేశంలోనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: కాంగ్రెస్‌ను మించిన గలీజు పార్టీ దేశంలోనే లేదని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో కుంభకోణాలు, లంబకోణాలు లేని నాయకుడు ఒక్కరూ లేరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కమీషన్లు, కాంట్రాక్టులకే పరిమితమైన నాయకులు ఆ పార్టీలో ఉన్నారన్నారన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత, డిసిసి మాజీ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెరాసలో చేరారు.
ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎంతమంది నిరుద్యోగులున్నారో తెలుసా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవరకు గడ్డం తీయనన్న ఉత్తమ్, అలాగే ఉంటే సన్యాసుల్లో కలువడం ఖాయమని ఎద్దేవా చేశారు. దేశంలో డెబ్బై ఏళ్లలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. భవిష్యత్‌లో ఈ పధకాన్ని దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి అన్నారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.