బిజినెస్

అనిశ్చితిలోనూ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 12: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో మంచి లాభాలతో ముగిశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ మొత్తంమీద బుల్స్ ఆధిక్యమే కొనసాగి, కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి. రూపాయి బలహీనత కొనసాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం, మధ్య ప్రాచ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులను కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు అధిగమించి బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 620.41 పాయింట్లు పుంజుకొని, 35,535.79 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 188.25 పాయింట్లు పెరిగి, 10,806.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇరాన్‌తో అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి బయటకు రావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో చమురు సరఫరాలపై ప్రతికూల ప్రభా వం పడుతుందేమోననే ఆందోళనతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ వారంలో ప్రపంచ ఆర్థిక మార్కె ట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. గురువా రం మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల కొద్దిపాటి నష్టాలకు గురయినప్పటికీ, నాలుగో త్రైమాసికం (క్యూ4)లో కార్పొరేట్ కంపెనీలు సాధించిన ప్రోత్సాహకర నికర లాభాల నేపథ్యంలో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) ఉత్సాహంతో పెట్టిన పెట్టుబడుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో లాభపడ్డాయి. ఇండెక్స్ దిగ్గజ సంస్థలయిన రిలయన్స్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐఎన్, టా టా స్టీల్ వంటి కంపెనీల షేర్ల ధరలు పెరగడం కూడా కీలక సూచీలు పుంజుకోవడానికి గణనీయంగా దోహదపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ నా లుగో త్రైమాసికంలో సాధించిన నికర లాభం బలహీనంగా ఉన్నప్పటికీ, మొండి బకాయిలను వసూలు చేయడానికి కట్టుబడి ఉన్నామని బ్యాంకులు ఇచ్చిన ప్రకటన మద్దతుతో ఈ బ్యాంక్ షేర్ ధర పెరిగింది.
సెనె్సక్స్ ఈ వారం 34,983.59 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 35,596.15- 34,977.74 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 620.41 పా యింట్ల (1.78 శాతం)పైన 35,535.79 పా యింట్ల వద్ద ముగిసింది. క్రితం వారంలో సెనె్సక్స్ 54.32 పాయింట్లు పడిపోయింది.
నిఫ్టీ కూడా ఈ వారం 10,653.15 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 10,812.05- 10,635.65 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 188.25 పాయింట్ల (1.77 శాతం) పైన 10,806.50 పాయింట్ల వద్ద స్థిరపడింది.
చమురు- సహజ వాయువు, బ్యాంకులు, మెటల్, పీఎస్‌యూలు, ఎఫ్‌ఎంసీజీ, ఐపీఓలు, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఆటో రంగాల షేర్ల ధర లు ఈ వారంలో పెరిగాయి. మదుపరుల లా భాల స్వీకరణ కారణంగా హెల్త్‌కేర్, పవర్, క న్స్యూమర్ డ్యూరేబుల్స్, టెక్నాలజి, రియల్టీ షే ర్ల ధరలు పడిపోయాయి. ఇదిలా ఉండగా, ఈ వారంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో నికరంగా రూ. 1,425.26 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.