బిజినెస్

మా పరిశోధనలను సొమ్ము చేసుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 12: అమెరికాలో తయారైన ఔషధాలు, వైద్య పరికరాలకు ధరలను ఖరారు చేసే బాధ్యతను వాణిజ్య ధరల సంప్రదింపుల కమిటీ స్వీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆదేశించారు. అమెరికా ఉత్పత్తులకు విదేశీ సంస్థలు ధరలు ఖరారు చేయడం సమ్మతం కాదని స్పష్టం చేశారు. అమెరికా సంస్థల్లో జరిగిన పరిశోధనలతో తయారైన ఔషధ, వైద్య పరికరాల ఉత్పత్తులకు విదేశీ సంస్థలు ధరలను నిర్ణయించడమేంటని ఆయన అన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో తయారైన ఔషధ ఉత్పత్తులను ఇక్కడ రోగులకు సరసమైన ధరలకు ఇవ్వడమే లక్ష్యమని, అదే విధంగా ఈ మందులు విదేశాల్లో ఉన్న రోగులకు కూడా చౌకగా అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శే్వతసౌధంలోని రోజ్ గార్డెన్‌లో ఈ విషయమై ఆయన విధాన ప్రకటన చేశారు. కొన్ని ఫార్మా ఉత్పత్తులు విదేశాల్లో కొన్ని డాలర్లకు లభిస్తాయి. అవే ఉత్పత్తులు అమెరికాలో కొన్ని వందల డాలర్లను వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది అని ట్రంప్ అన్నారు. ఈ విధానాన్ని తాము అంగీకరించే ప్రసక్తిలేదన్నారు. కొన్నిదేశాల్లో చాలా తక్కువ ధర కే లభించే మందులను ఇక్కడి రోగులు కొనుగోలు చేయలేక సతమతమవుతున్నారని ట్రంప్ అన్నారు. ఇదొక హాస్యాస్పదమైన నిర్ణయమన్నారు. ఈ తరహా దోపిడీని ఇక ఎంత కాలం కొనసాగించే వీలు లేదన్నారు. అమెరికాలో రోగులకు సంకటంగా మారిన ఫార్మా ఉత్పత్తుల ధరలపై దృష్టిని సారించాలని అమెరికా ట్రేడ్ ప్రతినిధి బాబ్ లిట్జర్‌ను ఆదేశించామని, ఈ విషయాన్ని సత్వరమే అధ్యయనం చేయాలని కోరినట్లు శే్వతసౌదాధిపతి పేర్కొన్నారు. అమెరికా ఫార్మా ఉత్పత్తులపై సొమ్ము చేసుకునే విదేశీ ఫార్మా సంస్థల ఆటలను కొనసాగించే ప్రసక్తిలేదని వైట్ హౌస్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అలెక్స్ జార్ పేర్కొన్నారు.