క్రైమ్/లీగల్

ట్రాక్టర్, గడ్డివాము దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, మే 14: శంకరపట్నం (మం) గద్దపాకలో సోమవారం ఇదే గ్రామానికి చెందిన రాచర్ల యాదగిరికి సంబంధించిన ట్రాక్టర్ సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభం విరిగి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడడంతో షాట్ సర్క్యూట్ ఏర్పడి స్వామికి చెందిన గడ్డివాము దగ్ధమై ట్రాక్టర్ సైతం దగ్ధమైనట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు గ్రామస్థులు తెలిపారు. కడుపేదరికంతో జీవనభృతి కొనసాగిస్తున్న యాదగిరికి చెందిన ట్రాక్టర్ దగ్ధం కావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
కరీంనగర్ రూరల్, మే 14: కరీంనగర్ రూరల్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీ బుగ్గాల సుశీల అనే మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, తోటి కూలీల వివరాల ప్రకారం ఉదయం ఉపాది కూలీకి పనులు చేస్తుండగా అస్వస్తతకు గురికావడంతో వెంటనే కరీంనగర్ అసుపత్రికి తరలించగా వైద్యం పొందుతు మృతి చెందిందని వారు తెలిపారు. కాగా మృతురాలికి భర్త, ఇద్దరు కమారులు ఉన్నారు.