కరీంనగర్

దేశానికి ఆదర్శం ‘రైతుబంధు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లందకుంట, మే 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం దేశానికే ఆదర్శమని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ‘రైతుబంధు’ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నాయకులు ఇల్లందకుంట నుండి సిరిసేడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా, ఒగ్గు కళాకారులు డప్పుచప్పుళ్లు, మహిళల మంగళహారతుల మధ్య కోలాటాలు చేస్తూ మంత్రిని ఘనంగా స్వాగతించారు. మంత్రి ఈటల రాజేందర్ సిరిసేడు రెవెన్యూ పరిధిలోని సుమారు మూడు గ్రామాలలోని రైతన్నలకు 94 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పది సంవత్సరాల టిడిపి పాలనలో తెలంగాణ పూర్తిగా అన్ని రకాలుగా అభివృద్ధికి నోచుకోలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలలోనే అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతూ విమర్శలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సూచించినా పట్టించుకోని వారు ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు దశల వారిగా సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ను స్థానిక నా యకులు, గోల్ల, కుర్మలు, గౌడ కులస్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, డిఎఓ శ్రీ్ధర్, సర్పంచ్ బుర్ర రమేష్, ఎంపిటిసి మురహరి సరస్వతి శంకర్, మార్కెట్ చైర్మన్ పింగిళి రమేష్, తహశీల్దార్ రమేష్, ఎడిఎ దామోదర్ రెడ్డి, ఎఓ రజితతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.