కరీంనగర్

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, మే 14: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడంతోపాటు పెద్దపల్లి నియోజకవర్గానికి మొదటగా నీరు అందించడం జరుగుతుందని, రైతుల ఆత్మబంధు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలో ‘రైతుబంధు’ పథకాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రా రంభించారు. అనంతరం జరిగిన స మావేశంలో బాల్క సుమన్ మాట్లాడు తూ తెలంగాణలోని రైతన్నల కష్టాలు తీర్చడానికే ముఖ్యమంత్రి కెసిఆర్ కా ళేశ్వరం ప్రాజెక్టుతోపాటు, పలుచోట్ల ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. కాంగ్రె స్ 60 ఏళ్లుగా చేయని అభివృద్ధిని కెసిఆర్ నాలుగేళ్లలో చేశారని, దీన్ని చూడలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు, రై తులు నమ్మవద్దన్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగాలు సైతం చేసేందుకు వెనుకాడకుండా కెసిఆర్ ముందుండి రాష్ట్రాన్ని సాధించుకోవ డం జరిగిందన్నారు. ఏ ప్రభుత్వం చే యనివిధంగా తెలంగాణ రైతాంగాని కి తమ ప్రభుత్వం ‘రైతుబంధు’ ద్వా రా అందిస్తున్న పంట పెట్టుబడి చరిత్ర లో చిరస్థాయిగా నిల్చిపోతుందనా నరు. నాలుగేళ్లుగా రైతాంగం అభివృద్ది కోసం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారన్నారు. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందించిన ప్రభుత్వం రైతాంగం పంట పెట్టుబడి కోసం శాస్వత పరిష్కారం చూపాల ని, రైతులకు అండగా ఉండాలనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఎకరా కు నాలుగు వేల చొప్పున, ప్రస్తుతం ఆరు వేల కోట్లను రైతులకు అందించేందుకుగాను ప్రభుత్వం బ్యాంకుల్లో నగదును జమచేసిందన్నారు. ప్రాజెక్టు ల పనులు పూర్తయితే వరద కాలువ తో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీ రు వస్తుందని, దీంతో చివరి ప్రాంతాలకు నీరు అందుతుందన్నారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ల క్ష్యంగా, సాగునీటి ఇబ్బందులు లేకు ండా, రైతులతోపాటు అన్నిరంగాల ప్రజల అభివృద్ధే కెసిఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని బాల్క సుమన్ అనా నరు. సమావేశంలో సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, ఎంపిటిసి బుర్ర వౌనిక, శ్రీనివాస్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కోట రాంరెడ్డి, స్పెష ల్ ఆఫీసర్ రాజన్న, తహశీల్దార్ రజి త, ఎంపిపి పారుపెల్లి రాజేశ్వరి, సింగిల్‌విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, నల్ల మనోహర్ రెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు బాలాజీరావు, రైతు సమన్వయ సమితి సభ్యుడు పురం ప్రేంచందర్ రావు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకు లు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.