కృష్ణ

నిలిచిన ధాన్యం కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్ళు గత వారం రోజులుగా నిలిచిపోవటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొనుగోళ్ళు ఈప్రొక్యూర్‌మెంట్ ద్వారా చేయటం వల్ల సాఫ్ట్‌వేర్ పని చేయక కొనుగోలు నిలిపివేసినట్లు మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు. దీంతో కొనుగోళ్ళు లేక రైతులు యార్డులోనే రోజుల తరబడి పడిగాపులు పడాల్సివస్తోంది. ఇటీవల కురిసిన అకాల వర్షానికి కొంత ధాన్యం తడిసి పాడైపోయిన విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో మళ్ళీ ఎప్పుడు అకాలవర్షం సంభవించి తమ ధాన్యాన్ని నాశనం చేస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత పది రోజులుగా కొనుగోళ్ళు నిలిచినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికి సుమారు 750 టన్ను ధానాన్ని కాటా వేయగా ఇంకా మూడు వేల టన్నుల ధాన్యం కాటా వేయాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. తొలి దశలో కొనుగోలుకు అవసరమైన సంచులు లేక కొంతకాలం కొనుగోళ్ళు నిలిచిపోగా రైతుల ఆందోళనతో అధికారులు సంచులను తెప్పించి ఇచ్చారు. తాజాగా ఈప్రొక్యూర్‌మెంట్ పని చేయక కొనుగోళ్ళు నిలిచిపోవటంతో ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని రైతులు అక్కడే రేయింబవళ్ళు ధాన్యానికి కాపలా ఉంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.