హైదరాబాద్

రంజాన్ దీక్షలు షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నెలరోజుల పాటు జరిగే రంజాన్ దీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలు ఎపుడు ప్రారంభించాలన్న అంశంపై బుధవారం అర్థరాత్రి వరకు సందిగ్దత నెలకొని ఉండటం, గురువారం ఉదయం నుంచే పాటించాలంటూ అర్థరాత్రి మతగురువులు ప్రకటించటంతో ముస్లింలలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. మొట్టమొదటి ఇఫ్తార్‌ను సాయంత్రం నిర్వహించుకున్నారు. రంజాన్ దీక్షలు గురువారంతో ప్రారంభం కావటంతో పాతబస్తీ పరిసర ప్రాంతాలన్నీ అదనపు వెలుగులతో ధగధగలాడుతున్నాయి. హలీం విక్రయ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఓల్డ్‌సిటీతో పాటు న్యూసిటీలోనూ పేరుగాంచిన పలు హోటళ్లు ఆన్‌లైన్‌లో హలీం బుక్ చేసుకున్న వారికి నేరుగా హోం డెలివరీ కూడా ఇస్తున్నాయి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ నగరంలోని మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద అదనపు ఏర్పాట్లు చేసింది.