శ్రీవిరించీయం

ఎస్టేట్ రాజకీయాలు- అబద్ధం ఆడని డిప్యూటీ దివాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విజయపురి రాజావారికి సంక్రమించిన సంపత్తి అంతా ఇంతా కాదు.. జమీందార్లకుండే సహజ వ్యసనాలతోపాటు పులివేటలు, తెల్లదొరలకు విందులు, విదేశీ యాత్రలు, గుర్రపు పందేలు అంటే విజయపురి రాజావారికి అపరిమితమైన మోజు. అవసరాలకుగాను ఓ మామిడితోటను అమ్మకానికి పెట్టారు. ఈ అమ్మకం విషయంలో ఎస్టేట్ సూపర్‌వైజర్ శివరావుగారు రామచంద్రయ్య అనే కొనుగోలుదారును తీసుకువచ్చి పరిచయం చేశాడు’.
పులిగడ్డ విశ్వనాధరావు రాసిన ‘్ధర్మరాజును మించిన ఓ సుబ్బారావు’ అన్న కథానికలో సందర్భం ఇది.
రామచంద్రయ్య కొనుగోలుకు అడ్వాన్స్ సమర్పించుకున్నాడు శివరావుకు. పూర్తి డబ్బు రెండు నెలలలో ఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఇంతలోనే రామచంద్రయ్య ఆర్థిక స్థితి దిగజారిపోయింది. మామిడి తోట కొనగలగడం అసాధ్యం అయిపోగా, తను అడ్వాన్స్ ఇచ్చిన పైకం తిరిగివస్తే తప్ప జీవితం గడవని స్థితి ఏర్పడింది. రామచంద్రయ్య అతి నిజాయితీగా శివరావు దగ్గరకు వెళ్లి తన అవస్థ చెప్పుకున్నాడు. అయితే శివరావు మాత్రం అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇచ్చే పద్ధతి లేదని కరాకండిగా చెప్పివేయడమేగాని రాజావారితో రుూ సంగతి ప్రస్తావించి మనం ఏమి వాపసు చెయ్యనక్కరలేదు అని నమ్మబలికాడు. రామచంద్య్రకు కోర్టుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. నరసింహం అనే తన పాత నౌకరును సంప్రదించగా అతడు ‘డిప్యూటీ దివాన్ సుబ్బారావుగారు ఒక్కడే మీకు సాయపడగలడు. ఆయన్ను ఆశ్రయించండి’ అని సలహా ఇస్తాడు. అయితే రామచంద్రయ్య ఆయన్ను కలుసుకుని, తనకు న్యాయం జరిపించమని ప్రాధేయపడతాడు. సుబ్బారావు ఈ అడ్వాన్స్ డబ్బు జమీందారి పద్దు పుస్తకాలలో నమోదు అయిన సంగతి తెలిసినవాడు గనుక, తప్పకుండా సహాయం చేస్తానంటాడు. తీరా కోర్టుకు వెళ్లవలసిన సమయంలో ఆయనకో విచికిత్స ఏర్పడుతుంది. జమీందారుకు వ్యతిరేకంగా సాక్ష్యం యిస్తే తన ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. అబద్ధం ఆడి ఉద్యోగం నిలుపుకోవడమా లేక నిజానికి కట్టుబడి ధైర్యంగా నిలబడడమా- ఏం చేయడం అనేది ఆ విచికిత్స. అబద్ధం ఆడడం తప్పుకాదు, దుర్యోధనుడంతటివాడే కురుక్షేత్రంలో అబద్ధం చెప్పలేదా అని తనకు తనా చెప్పుకోవడమే గాక భార్యతోనూ ప్రస్తావించాడు. తీరా కోర్టు దగ్గరకు వెళ్లినపుడు ఎదురు పార్టీ వకీలు ప్రశ్నలకు జవాబు చెబుతూ ‘ఆ డబ్బు జమీందారు పుస్తకాలలో నమోదు అయింది’ అని నిజం చెప్పేస్తాడు. కోర్టువారు రామచంద్రయ్యకు ఈ అడ్వన్స్ వాపసు ఇచ్చివేయమని ఉత్తరువు ఇస్తారు. శివరావు మాత్రం ఉక్రోషం కొద్దీ సుబ్బారావును బర్తరఫ్ చేయవలసిందని గట్టిగా సిఫారసు చేస్తాడు. అందుకు జమీందారు చెప్పిన సమాధానం చూడండి: శివరావు, బర్తరఫ్ చేయవలసింది నిన్ను. ఈ వ్యవహారంలో సుబ్బారావుగారికి ప్రమేయం వుంటుందని నీకు తెలుసు. దానికితోడు ఆయన నైజం కూడా నీకు తెలుసు. అటువంటి పరిస్థితిలో నువ్వు ఇచ్చిన చచ్చు సలహా వలన ఈ చిక్కు వచ్చిపడింది. ఇకముందు నువ్వు ఇటువంటి పనికిమాలిన సలహాలు ఇవ్వకుంటే నీకే మేలు. అంతేకాకుండా, ఎస్టేట్ కొనుగోళ్లు అమ్మకాల విషయంలో నువ్వు కలుగజేసుకోవలసిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో’-
సుబ్బారావుగారు తనకు తాను ‘సాటి మనిషికి అన్యాయం జరుగుతూంటే చూసి ఊరుకోవడం ధర్మం కాదనిపించింది. ఉద్యోగం పోయినా ఫరవాలేదు. ఓ మనిషికి అన్యాయం జరగకూడదని నా మనసు నన్ను ఆదేశించింది’ అని చెప్పుకోవడమే గాని భార్యనూ సంబాళించారు.
ధర్మం పట్ల నిలిచినవాళ్లకు ఏమీ ఇబ్బంది ఎదురవదు అని చెప్పే మంచి కథానిక ఇది.

-శ్రీవిరించి