రాష్ట్రీయం

ఆవేశం.. ఆక్రోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 22: చంద్రబాబు నాయుడు కేంద్రంపై దూకుడు పెంచారు. ప్రత్యేక హోదాతోపాటు, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేదన్న ఆవేదన, ఆక్రోశం ఆయన ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. విశాఖలో మంగళవారం నిర్వహించిన ధర్మపోరాట సభలో చంద్రబాబు గంటకు పైగా ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో కేంద్రం రాష్ట్రానికి చేసిన ద్రోహంతోపాటు, వైసీపీ, జనసేన పార్టీలను తనపై ఉసిగొల్పుతున్నాయన్న ఆక్రోశం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ ప్రసంగాన్నిబట్టి కేంద్రంపై ఆయన పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని విపక్షాలకు సహకరించద్దని, టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అధిక మెజార్టీని తెచ్చిపెడితే, రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాలు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కేంద్రంపై పోరాడానికి జనాన్ని సన్నద్ధం చేస్తూ, ప్రతీ అంశంపైనా జనం నుంచి మద్దతు కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగం చేయడం అందరినీ ఆశ్ఛర్యపరిచింది.