రాష్ట్రీయం

విశ్వాస ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడింది, వెన్నుపోటు పొడిచిందని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. అశోక్ గెహ్లాట్, సుర్జేవాలా బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై సమీక్షించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న బీజేపీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా వారికి వెన్నుపోటు పొడిచిందని అన్నారు. రాజీవ్ గాంధీ తరువాత 30ఏళ్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి భారీ మెజారిటీ వచ్చింది.. అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందనే పోస్టర్‌ను విడుదల చేశారు. స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ దేశానికి మేలు చేస్తారని ప్రజలు భావించారు. అయితే మోదీ మాత్రం విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. అందుకే ప్రజలు ఆయనకు ఓటేశారు. కానీ, మోదీ మాత్రం విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని గెహ్లాట్ దుయ్యబట్టారు.
మోదీ ప్రభుత్వం మీడియాపై వత్తిడి తెస్తోందని, అయితే మీడియా మాత్రం ఈ వత్తిళ్లకు లొంగడం లేదు కాబట్టే కర్నాటకలో బీజేపీకి చుక్కెదురైందని అన్నారు. మా చరిత్ర, నడవడి, రూపం వేరని చెప్పుకునే బీజేపీ హామీలను అమలు చేయకపోవడమే వారి ప్రత్యేకతా? అని ఎద్దేవా చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల వలన దేశంలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాల మూలంగా ఈ పరిస్థితులు నెలకొంటున్నాయన్నాయని గెహ్లాత్ ఆరోపించారు. ఉత్పత్తి ఖర్చులకు మరికొంత ధనాన్ని జోడించి కనీస మద్దతు ధర నిర్ణయిస్తామంటూ రైతులకు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవటం లేదన్నారు. రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామనే హామీని కూడా తుంగలో తొక్కి యువతను మోదీ నిరాశపరిచారని గెహ్లాట్ విమర్శించారు. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.. పెట్రో ధరలు అత్యధిక స్థాయికి పెరిగాయని, పెట్రోలు, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావటం లేదని నిలదీశారు. కర్నాటక ఎన్నిక సమయంలో పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచని కేంద్రం ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే రేట్లు పెంచిందని ఆరోపించారు. దేశంలోని దళితులపై దాడులు పెరిగిపోయాయని, అవినీతి విషయంలో బీజేపీ అందరికంటే ముందున్నదని, వివిధ ఎన్నికల్లో బీజేపీ భారీస్థాయిలో డబ్బు ఎలా ఖర్చు పెట్టగలుగుతోందని నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు అంత త్వరగా కోట్లకు ఎలా పడగలెత్తాడు? రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా కుమారుడు దుష్యంత్ సింగ్ వాటాల విలువ ఎలా పెరిగింది, పది రూపాయల వాటాను లక్ష రూపాయల చొప్పున నీరవ్ మోదీకి ఎలా విక్రయించారని అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను దుర్వినియోగ పరుస్తోందని, బీజేపీ అధికారంలోకి వచ్చి ఈ 26వ తేదీకి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ జిల్లా స్థాయినుండి వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తుందని గెహ్లాట్ ప్రకటించారు.