ఐడియా

మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. డాక్టరు రాసిన మందు దొరక్కపోతే మళ్ళీ డాక్టరు దగ్గరకు వెళ్ళి మార్పించుకోవాలే తప్ప షాపువాడు ఇచ్చింది తీసుకోకూడదు. మీరు ఏ బ్రాండు వాడాలో నిర్ణయించాల్సింది డాక్టరు, మందుల షాపు వాళ్ళు కాదు. మెడికలు షాపువారికి మందుల్ని గురించి అంతా తెలిసి ఉంటుందని అనుకోకూడదు.
2.మందుపేరు, మోతాదు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. చాలాసార్లు పేరులో సారూప్యత ఉన్నందువల్ల ఒకదానికి బదులు మరొకటి ఇస్తారు.వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.
3. కొనబోయే ముందు దానిపైన మందు వాడటానికి ముందు ముగింపు (ఎక్స్‌పైరీ) తేదీని గమనించాలి. డేట్ అయపోయన టాబ్లెట్లు వాడకపోవడమే మంచిది. ఒక్కటే గదా అనుకోకూడదు. బీపీ, చక్కెర జబ్బు, మానసిక సమస్యలకు మందులు వాడేవాళ్ళు కొన్నిసార్లు మూడు నాలుగు నెలలకు సరిపడా మందులు ఒకేసారి కొంటారు. అలాంటప్పుడు దగ్గర ముగింపు తేదీ ఉన్న మందులు కొనకుండా కనీసం నాలుగు నెలల గడువు ఉండేవిధంగా కొనుక్కోవాలి.
4. తక్కువ మాత్రలు కొనేటప్పుడు కత్తిరించి ఇస్తారు. దాంతో కొన్నిసార్లు మందు పేరు, ముగింపు తేదీ వేరుపడిపోతాయి. ఎప్పుడైనా మనం మందును వాడాల్సి వస్తే అది ఏ మాత్రో తెలియదు. అందుకే అలాంటప్పుడు వాటిని ఒక కవరులో వేసి దానిపైన మందు పేరు, డోసు, ముగింపు తేదీని రాయించి తీసుకోండి. అవి పూర్తి అయ్యేవరకూ అదే కవరులో ఉండేటట్టు జాగ్రత్త పడాలి.
5. సిరప్పుల రూపంలో దొరికే సీసా మందును మూత తెరచిన నెలలోపే వాడాలి. మిగిలితే పడెయ్యాలి.
6. పిల్లలకు వాడే సిరప్పులు డాక్టరు చెప్పిన కొలత ప్రకారమే వెయ్యాలి తప్ప కొసరు వెయ్యకూడదు. చాలామంది తల్లులు జబ్బు త్వరగా తగ్గనపుడు చెప్పినదానికంటే కాస్త కొసరు వేస్తారు. ముఖ్యంగా దగ్గు మందులు. పిల్లలకు దగ్గు ఏమాత్రం కాస్త ఎక్కువ అయినా ఇంకొక డోసు ఇస్తారు. అలా చెయ్యకూడదు.
7. మందులను పిల్లలకు అందకుండా ఉంచాలి. వాటితో ఆడుకోవడం మంచిదికాదని పిల్లలకు నేర్పాలి.
8. అన్ని మందులు అందరికీ పడవు. ఈ విషయం డాక్టరుకి కూడా తెలియదు. మందులు ఏమైనా పడకపోతే ఆ విషయం ముందుగానే డాక్టరుతో చెప్పాలి.
*