మిర్చిమసాలా

గొప్పలు తెచ్చిన తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా మంచి జరిగితే అది తమ గొప్పేనని, చెడు జరిగితే ముందే చెప్పామని రాజకీయ పార్టీలు అనడం షరా మా మూలే. ఇటీవల ‘మహానాడు’ నిర్వహించిన తెలుగుదేశం పా ర్టీ గొప్పలు మరీ ఆకాశాన్నంటడంతో నెటిజన్లు దు మ్మురేపేశారు. దాం తో నాలుక కరచుకున్న తెదేపా తిప్పలు నుండి బయటపడేందుకు తమ గొప్పల్ని సవరించుకుంది. ఒకప్పుడు తాగునీటి వసతి సరిగా లేని హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందని, దేశంలోనే మేటి ఎయిర్ పోర్ట్ బేగంపేటలో ఏర్పడిందని, హైటెక్ సిటీ ఆవిర్భవించిందని- ఇదంతా తమ శ్రమ ఫలితమేనని తెదేపా అధినేత చంద్రబాబు ‘ట్వీట్’ చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టును 1930లో చివరి నిజాం నిర్మించారని , చార్మినార్‌ను కూడా తామే నిర్మించామని ఆ నేతలు చెప్పుకుంటారేమోనని నెటిజన్లు రియాక్షన్ ఇవ్వడంతో తెదేపా ఆ వాక్యాన్ని తొలగించింది.
-బీవీ ప్రసాద్

ఆ సందడే లేదు..
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు మూడున్నరేళ్ల పాటు ముప్పవరపు వెంకయ్యనాయుడు మంత్రి హోదాలో ఓ వెలుగు వెలిగారు. ఉప రాష్టప్రతి పదవి చేపట్టాక ఏపీలో ఆయన పర్యటనల జోరు తగ్గింది. గతంలో కేంద్రమంత్రిగా ఆయన ఎక్కడికి వెళ్లినా వివిధ పార్టీల నాయకులు, అధికారులు, విద్యార్థులు, యువకులు బ్రహ్మరథం పట్టేవారు. అయితే, ఇటీవల ఒక్కసారిగా సీన్ మారిపోయిం ది. ‘ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ’ భవన నిర్మాణాలకు శంకుస్థాపన సందర్భంగా వెంకయ్యకు సాదాసీదా స్వాగతం లభించింది. ఒక ఎంపీ, ఒక మంత్రి మినహా ఆయనను పలకరించేవారే లేకపోయారు. ఉప రాష్టప్రతి హోదాలో వెంకయ్య అడపా దడపా వస్తున్నా, ఆయన పర్యటనల్లో ఒకప్పటి కోలాహలం కనిపించడం లేదు. ఎన్డీఏ నుంచి తెదేపా నిష్క్రమించడంతో ఏపీలో ఆయన పర్యటనలు తగ్గుముఖం పట్టాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
-నిమ్మరాజు చలపతిరావు

ఫ్యామిలీ ఫ్రంట్..!
తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, దీనికి ‘ఫెడరల్ ఫ్రంట్’కు బదులు ‘్ఫ్యమిలీ ఫ్రంట్’గా నామకరణం చేస్తే బాగుంటుందని భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ఓ సభలో వ్యాఖ్యానించడంతో సభికులు గొల్లుమని నవ్వారు. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నందున, వివిధ రాష్ట్రాల్లో కుటుంబ పాలన కొనసాగిస్తున్న పార్టీల వద్దకు ఆయన వెళ్లారని భాజపా నేత గుర్తు చేశారు. యూపీలో ఎస్‌పి నేత అఖిలేష్ యాదవ్‌ను, చెన్నైలో డిఎంకె నేతలు కరుణానిధిని, ఆయన కుమారుడు స్టాలిన్‌ను, కర్నాటకలో జెడీఎస్ నేత హెచ్‌డి దేవెగౌడను, ఆయన కుమారుడు కుమారస్వామిని కేసీఆర్ కలిశారని అన్నారు. తెరాసకు మద్దతునిస్తున్న మజ్లీస్ పార్టీ కూడా ఓవైసీ కుటుంబ పార్టీ అని లక్ష్మణ్ వివరించారు. ఈ కుటుంబ పార్టీలన్నీ ‘్ఫ్యమిలీ ఫ్రంట్’గా అవతరిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు.
-వి.ఈశ్వర్ రెడ్డి