Others

మా పిల్లి మా ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా పిల్లి - అబ్బో అది సాక్షాత్తు పులే
అదెప్పుడూ
ఒర వీరయోధుడు ఖడ్గాన్ని సానబట్టుకున్నట్టు
తన పంజాలను పదును పెట్టుకుంటూ వుంటుంది
చెట్టు తొర్ర దగ్గర తొండ కోసం చెవులు రిక్కించి
నిర్నిద్ర స్థితిలో మాటువేసినప్పటి దాని భంగిమ
నాసామిరంగ! పెద్దపులి తాతను తలపిస్తుంది

ముంగాళ్ళను సాచి, శరీరాన్ని పెంచి
ఏకాగ్రత చెదరని చూపుతో
ఎలుక మీదకు లంఘించినప్పుడు చూడాలె
అపసోపాలు పడి జింకను వేటాడినప్పటి
సింహం కన్నా మా పిల్లే సూపర్!

రెండడుగులు వెనక్కి వేసినట్టే వేసి
స్ప్రింగ్‌లాగ కుప్పించి ఎగిరి
ఎదురింటోళ్ళ కోడిమెడను
గాలిలో గావు పట్టినప్పటి మా పిల్లి మహా విన్యాసం ముందు
కొమ్మ మీదకు గెంతి కొంగ గొంతును
పట్టుకున్నప్పటి చిరుతపులి స్టంట్ బలాదూర్!

పక్కింటోళ్ళ పెంపుడు కుక్క
దీని బొక్కను కాజేయటానికి వచ్చినప్పుడు
చిత్ర విచిత్రమైన ధ్వనులతో వీరాలాపాలు చేస్తూ
శరీరాన్ని పొంగించి తోకను తాచుపామంత పెంచి
నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో
ముళ్ళపంది అవతారం ధరించి
రౌద్రాకారంతో ఎగిరి ఒడుపుగా పంజా విసరగానే
గాయపడి గాయగాయ చేసి తోకముడిచి
కుక్కిన పేనై తన యజమానురాలి వెనుక నక్కింది కుక్క
ఆ అవమానం భరించలేక ఆమె
మా పిల్లి వాళ్ల పాలను తాగిపోయందని కోట్లాటకు దిగింది!
అప్పుడు మాకు మా నల్లపిల్లిలో
సాక్షాత్తు బాలకృష్ణుడే కనిపించాడు!

- అమ్మంగి వేణుగోపాల్, 9441054637