సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1266. మాత రుూ క్రూర రాక్షాస స్ర్తిలు మిమ్ము
యెంతొ బాధపెట్టిరి యనుమతిని యిమ్ము
నందర నిపుడె క్షోభింపజేతుననగ
వలదు హనుమ రాజాజ్ఞకు వశులు వీరు

1267. వీరి దోషమేమియు లేదు వీరిని క్ష
మించితి పవనాత్మజ రామచంద్రువేగ
జూడ గోరుచుంటినటంచు దెల్పుమయ్య
ఆ స్వజనరక్షాపర దురంధరున కనక

1268. తల్లికిని మ్రొక్కి జానకీపతిని జేరి
వాయుపుత్రుడు వినిపించె రఘువరునకు
మాత సందేశమును విన్న రామభద్రు
జలజ నేత్రము లార్ధ్రములయ్యె నపుడు

1269. రఘువరుం డంతట విభీషణా! ధరణిజ
నంతిపురం జనంబులతోడ నా మెకలర
మంగళ స్నాత గావించి వస్తభ్రూష
ణములతో నలంకృతను జేయించిదెమ్ము

1270. అక్షరమ్ముల పాటించె నసుర విభుడు
రాము నాజ్ఞను సద్గుణ నిధిన వనిజ
సతిని జూచి రాముడు హృదయమున ముదము
జెందె తోడనే గల్గె నశాంతియున్ను

1271. రాము దర్శనమున సీత ముఖము పూర్ణ
చంద్ర బింబమై వెల్గె పదారు కళల
రాముడప్పుడు జానకీ రోగగ్రస్త
కన్నులకు దీపశిఖవలె నుంటి నీవు

1272. దక్షిణదిశ నగస్త్యుండు గెల్చినట్లు
లోక కంటకుడౌ దశకంఠుజంపి
భర్తగా నీచెర విడిపించి రఘువంశ
గౌరవము నిలిపితి పౌరుషమ్ము జూపి

1273. దుష్టుకాముకునింట నీవింతకాల
మున్ననీ శీలమును విశ్వసింపలేను
లక్ష్మణ విభీషణ సుగ్రీవులున్న వారు
జనుము నీ కిష్టమైన తావునకు ననగ

1274. రామచంద్రు మాటల బాణములకు సీత
కన్నులశ్రుపూర్ణములయ్యె మదగజమ్ము
తుండమున జుట్టి విసిరిన సుమలతవలె
వణికె తేరుకొనుచు కంత వడికి సాధ్వి

1275. ‘‘ఓ మసావీర! సామాన్య నరులవలెను
కరకు మాటల బాధంపనేల నేను
జనకభూపతి పుత్రిని భూమినుద్భ
వించితి నయోనిజగ నెరుగుదువు నీవు

1276. కొందరెవ్వరో తక్కువ జాతి వనిత
లవలె నన్ను శంకింప భావ్యమ్బుగాదు
రావణుడు బలిమినిదెచ్చు వేళ నేను
త్రికరణమ్ముల మిమ్మే దలంచుచుంటి

1277. దీనవదనుడై యున్న సౌమిత్రి తోడ
లక్ష్మణా! యపనిందతో బ్రతుకజాల
దీనికౌషధమొక్కటే చితిని సిద్ధ
మరుచు మన జూచె సౌమిత్రి రఘురవరేణ్యు

1278. రామచంద్రుడు వౌనము దాల్చియుండె
శోకమున నేత్రములు వర్షింపగ సుమిత్ర
పుత్రుడగ్ని హోత్రము సిద్ధపరచినిల్చె
సుగుణనిధి ధర్మ చారిత్ర సాధ్విసీత

1279. భర్తకు ప్రదక్షిణ నమస్మృతు లొనర్చి
దేవఋసి గణభూదేవతలకు మ్రొక్కి
అగ్నిదేవు సమీపించి శిరమువంచి
హస్తయుగళము జోడించి యవనిపుత్రి

1280. హవ్యవాహను ప్రార్థించె నవనితనయ
‘‘నా హృదయమెల్ల వేళల రామునందె
లగ్నమైయున్న దను సత్యమును హుతాశ
నుండు లోకవిదితము నొనన్చుగాక!’’

1281. ప్రజ్వలించు నగ్ని శిఖల పుడమిపుత్రి
నిర్భయంబుగ జొచ్చుట గనిరి జనులు
రాక్షస స్ర్తిలు హాహారవములు జేసి
రపుడు రాముకన్నులు నిండె నశ్రువులను

1282. అంబరమునుండి దిగివచ్చి రజమహేశ్వ
రాది దిక్పతులు ఋషులు రాముకడకు
రామ! లోక కారణభూత ధర్మమూర్తి
ఆదిమధ్యాంత రహిత యనాది పురుష

1283. రాఘవా! నిన్ను యోగులు హృదయపద్మ
మందు బాగుగ జూతురనన్య చిత్త
ములతొ భక్తి యోగంబుల బ్రహ్మవనుచు
నని కమలభవ శంకరేంద్రులునుతింప

1284. సర్వులకు పూజనీయుడ నీవె రామ
వేద వేద్య దయాసముద్రుడ యధర్మ
కర్మములను ధర్మనాశము గల్గినపుడు
నవతరింతువు లక్ష్మీశ! విశ్వజనక!

1285. వాణినాధుని ప్రార్థన విన్న యగ్ని
మానవాకారమును దాల్చి రామభద్ర!
పరమ సాధ్వి మహాపతివ్రత ధరణిజ
సీత సాన్నిధ్యము నను పవిత్రుజేసె

టంగుటూరి మహాలక్ష్మి