తెలంగాణ

టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించింది శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణలో గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించింది శూన్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేరని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలకు ఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వకుండా రైతు కుటుంబాలను ప్రభుత్వం మోసగించిందని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ సక్రమంగా అమలు కాలేదని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, దీంతో కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేసీ ఆర్ పానలో 22వేలకు పైగా పరిశ్రమలు మూతపడి 8వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. అన్ని రంగాల వారిని తమ మాయ మాటలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కుట్రలను చేధిస్తామని చెప్పారు.