రంగారెడ్డి

రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూన్ 1: పాతబస్తీలో గత శనివారం జరిగిన దాడిలో మృతిచెందిన చంద్రయ్య బాధిత కుటుంబానికి, గాయపడ్డ ఇతరులకు రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బుడగ జంగాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుడగ జంగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మృతుడి భార్య వెంకటమ్మ, సంఘం ప్రతినిధులు కళ్లెం అంజనేయులు, సిరిగిరి మాన్యం మాట్లాడుతూ గత శనివారం పాతబస్తీలో చోటుచేసుకున్న సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. యాచిస్తూ జీవించే చంద్రయ్య, బెల్జిపాటి స్వామి, రవి, శంకరయ్య, నర్సింహాపై దాడి జరిగితే హిజ్రాలుగా చూపుతూ కుట్ర చేశారని ఆరోపించారు. ఘటనలో చంద్రయ్య అక్కడిక్కడే చనిపోయాడని వివరించారు. పోలీసుల సమక్షంలోనే బాధితులను కొట్టడం దారుణమని అన్నారు. మృతుడి బాధిత కుటుంబానికి, గాయపడ్డ ఇతరులకు ఒక్కోక్కరికీ ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు సామాజిక హత్య, కుట్ర నేరాల కింద కేసులు నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాచూరి శ్రీనివాస్, తాటికొండ కృష్ణ, గోపాల్, వెంకటేశ్ పాల్గొన్నారు.