విజయవాడ

పీసీసీ అధికార ప్రతినిధిగా పీవై కిరణ్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 1: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా పీవై కిరణ్‌కుమార్ నియామకమైనారు. ఈమేరకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి నగరంలోని పీసీసీ కార్యాలయంలో ఆయనకు నియామకపత్రాన్ని అందించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అవసరమని, ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారనడానికి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమాల్లో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొంటున్న తీరే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేది, విభజన హామీలను అమలుచేసేది కాంగ్రెస్ ఒక్కటేనన్న విషయంపై విస్తృత ప్రచారం చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతమే కాకుండా విజయపథాన వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పీసీసీ నేతలు మీసాల రాజేశ్వరరావు, వీ గురునాధం తదితరులు పాల్గొన్నారు.

బారీ బకాయిల వసూలుపై దృష్టి
*సిద్దార్ధ కళాశాల యాజమాన్యాన్ని కలిసిన మేయర్ శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 1: విజయవాడ నగర పాలక సంస్థకు భారీ బకాయిల వసూలుపై మేయర్ కోనేరు శ్రీ్ధర్ దృష్టి సారించారు. తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న వీఎంసీకి ఆర్ధిక ప్రయోజనం కలిగించేందుకు విన్నూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బకాయిలున్న సంస్థలకు వెళ్లి బకాయి వివరాలను తెలపడమే కాకుండా తక్షణమే పన్ను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రూ.80 లక్షల మేర పన్ను బకాయి ఉన్న నగరంలోని ప్రముఖ కాళాశాల సిద్ధార్ధ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరస్పాండెంట్ పాలడుగు లక్ష్మణరావు ను తన కార్యాలయంలో కలిసిన మేయర్ 2011 నుంచి 2018 వరకూ 80లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ను అందించేందుకు తగిన నగదు నిల్వ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీఎంసీ కి చెల్లించాల్సిన పన్ను బకాయిని వెంటనే చెల్లించాలని మేయర్ కోరగా, అందుకు స్పందించిన కరస్పాండెంట్ లక్ష్మణరావు పన్ను చెల్లింపునకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వీఎంసీ డెప్యూటీ రెవెన్యూ కమిషనర్ జీ సుబ్బారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.