విజయవాడ

శతకపద్యాలతో నైతిక విలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: బాల్యం నుంచి శతకపద్యాలను విద్యార్థులకు నేర్పించటం ద్వారా వారిలో నైతిక విలువలు పెంపొందించవచ్చని విశ్రాంత జిల్లా ఉప విద్యాశాఖాధికారి గుడిమెళ్ల జయబాబు అన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత పేర్లి దాసు రచించిన ‘నీతి శతక పద్య పుష్పాలు’ పుస్తకావిష్కరణ సభ శుక్రవారం మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో జరిగింది. పుస్తకావిష్కరణ చేసిన జయబాబు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ప్రతి తరగతికి ఒక శతకాన్ని తప్పనిసరి అంశంగా నిర్ణయించాలని ప్రభుత్వానికి సూచించారు. సాహితీ వేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు పుస్తక సమీక్ష చేస్తూ శతకపద్యాలు నేర్చుకోవటం ద్వారా ధార్మిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలతో పాటు మాతృభాషలోని పద ప్రయోగాలు, జాతీయాలు, నుడికట్టు మొదలైన భాషాంశాల మీద సాధికారత ఏర్పడుతుందన్నారు. తెలుగు భాషను అధ్యయనం చేయాలన్న ఆసక్తి పద్యపఠనం ద్వారా కలుగుతుందన్నారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమి ప్రదాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో బుద్ధి బలాన్ని పెంచటం, ధారణ సామర్థ్యాన్ని పెంపొందించటం కూడాశతకపద్య ధారణ ద్వారా అలవడుతుందన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఏడు శతకాల్లోని పద్యాలను ఎంచుకుని, వాటికి అతి సరళమైన భాషలో వ్యాఖ్యానాన్ని రచించి, బాలలు స్వీయ పఠన యోగ్యంగా రచయిత పుస్తకాన్ని తీర్చిదిద్దారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు తదితరులు పాల్గొన్నారు.

ఐఓటి సహాయంతో నూతన ఆవిష్కరణలు
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 1: స్థానిక ఎనికేపాడులోని ఎస్‌ఆర్‌కె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఎస్‌ఈ వి భాగం ఆధ్వర్యంలో ఐబి హాబ్స్ సం యుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేట్ ఆఫ్ థీంక్స్ (ఐఓటి) బూట్ క్యాంప్‌లో విద్యార్థులు, అధ్యాపకులు పలు ఆవిష్కరణలను చేశారు. ఈ కార్యక్రమం లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధులు, అధ్యాపకులు సృజనాత్మకతను వెలికితీసి వారిలోని నూతన ఆవిష్కరణలకు కార్యరూపం దాల్చడం జరిగిందని ఐబి హాబ్స్ ప్రతినిధి కావ్య తెలిపారు. సమన్వయకర్తగా డా డి హరిత వ్యవహరించారు. ఎస్‌ఆర్‌కె కళాశాల చైర్మన్ అప్పారావు, కార్యదర్శి శ్రీకృష్ణ, ప్రిన్సిపాల్ డా ఏకాంబరంనాయుడు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్న విద్యార్ధులను, అధ్యాపకులను అభినందించారు. భాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ విద్యార్ధులు ఇంటలిజెంట్ ఆటోమెబైల్ సిస్టమ్‌ను, ఎస్‌ఆర్‌కె కళాశాల, విజయ కళాశాల అధ్యాపకులు కలిపి కనెక్టెడ్ ఒవర్‌హెడ్ ట్యాంక్‌ను, కారుణ్య విశ్వవిద్యాలయం, ఆంధ్ర లాయోల కళాశాల విద్యార్ధులు కలిసి రైతునేస్తంను, కారుణ్య విశ్వవిద్యాలయం విద్యార్ధులు స్మార్ట్ గ్యాస్ అలర్ట్ సిస్టమ్‌ను, నలంద విద్యానికేతన్ విద్యార్ధులు డ్యాన్సింగ్ ఎల్‌ఈడీస్‌ను, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, విఐటి విద్యార్ధులు కలిసి డిజిటల్ నోటిస్ బోర్డులను, ఎస్‌ఆర్‌కె కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఆవిష్కరించారు.