కృష్ణ

డబ్బుల పంపిణీ వివాదంలో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: తోట్లవల్లూరు శివారు కలాసపమాలపల్లిలో గురువారం రాత్రి సంఘ సభ్యులకు డబ్బులు పంపిణీ సందర్భంగా వివాదం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకోవటంతో పాటు ఓ వర్గం ధర్నా చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి. ఎస్సీ ఫీల్డు లేబర్ కో ఆపరేటీవ్ సొసైటీలో 170 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘానికి పలుచోట్ల భూములు ఉన్నాయి. కాళింగదిబ్బలంకలో ఐదెకరాల భూమికి సంబంధించి రూ.1.50లక్షలు సంఘానికి వచ్చాయి. ఈ డబ్బులను గురవారం రాత్రి సంఘ సభ్యులందరికి రూ.500 చొప్పున సంఘం అధ్యక్షుడు దొడ్డా వెంకటేశ్వరరావు, సభ్యులు కలిసి పంపిణీ చేస్తున్నారు. అయితే పది, పదిహేను సంవత్సరాల క్రితం గ్రామానికి వచ్చి స్థిరపడిన అల్లుళ్ళకు కూడా డబ్బులు పంచాలని కొందరు పట్టుబట్టారు. వీరి వాదనకు సంఘం అధ్యక్షుడు దొడ్డా వెంకటేశ్వరరావు అంగీకరించలేదు. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తెలుగు నాని, తిరుమలరావు కుటుంబ సభ్యులు తమపై దాడి చేసి డబ్బులు ఎత్తుకు పోయారని సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తమపై అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, తదితరులు దాడి చేశారని నాని, తిరుమలరావు కుటుంబసభ్యులు కౌంటర్ ఫిర్యాదు చేశారు. దీంతో వెంకటేశ్వరరావు, ఆయన మద్దతు దారులు శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నానిని, తిరుమలరావు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని ఆందోళన చేశారు. దాంతో ఉయ్యూరు నుంచి సీఐ సత్యానందం వచ్చి చర్చించారు. వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సిఐ చెప్పి వెళ్ళిపోయారు. అయితే కొందరు రాజకీయ నాయకుల ఒత్తిళ్ళతో వ్యవహారాన్ని తప్పదోవ పట్టిస్తున్నారంటు అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మరో వందమందితో ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల వద్దకు వచ్చి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు అడ్డంగా బైకులు నిలిపి ధర్నా చేపట్టారు. నానికి, తిరుమలరావుకి మద్దతిస్తున్న నేతలను పిలవాలని, 400 మంది కావాలో ఐదుగురు కావాలో తేల్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. తహశీల్దార్ జి భద్రు, ఎస్‌ఐ మురళీ వచ్చి ఆందోళనకారులతో చర్చించగా సంఘ సభ్యులకు డబ్బులు పంపిణీ చేస్తుంటే దాడి చేసిన నానిని, తిరుమలరావు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. అప్పటికే తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న నానిని ఎస్‌ఐ మురళీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దాంతో ఆందోళన విరమించారు. పరస్పర ఫిర్యాదులు చేయటంతో ఇరు వర్గాల వారిని స్టేషన్‌లోనే ఉంచారు. సాయంత్రం వరకు కేసులు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. కలిసిమెలిసి ఉండాలని, గ్రామంలో వివాదాలు మంచిది కాదని రాజీ చేసేందుకు పెద్దలు రంగ ప్రవేశం చేసినట్టు సమాచారం.