కృష్ణ

మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి రూ.22.28 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మైలవరం నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 22.28 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. జలవనరుల శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బి పనులకు వివిధ గ్రాంట్ల ద్వారా ఈనిధులు మంజూరైనట్లు తెలిపారు. విజయవాడ-విస్సన్నపేట(వివిరోడ్)రోడ్ 7/6 కిమీ నుండి 19/310 కిమీ వరకూ వైడ్నింగ్ అండ్ స్ట్రెంగ్తనింగ్ చేయటానికి 13.60 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా వేసిన మెటల్ రోడ్లను తారురోడ్డుగా మార్చటానికి 3.10 కోట్ల రూపాయలు, మద్దులపర్వ నుండి కూనపరాజుపర్వ వరకూ 1.70 కోట్ల రూపాయలు, కవులూరు-వెలగలేరు ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి కొత్తూరు తాడేపల్లి వరకూ 1.40 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఈ ఏపి గ్రాంట్ 5.58 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. వీటిలో పుల్లూరు నుండి సీతారాంపురం తండాకు 56 లక్షల రూపాయలు, అనే్నరావుపేట నుండి అనే్నరావుపేట తండాకు 1.02 కోట్ల రూపాయలు, వివి రోడ్డు నుండి నాగులూరు తండా వయా సాయన్నపాలెం వరకూ 2.70 కోట్ల రూపాయలు, త్రిబులెక్స్ కాలనీ నుండి సూరాయిపాలెం వరకూ 1.30 కోట్ల రూపాయలు రోడ్ల విస్తరణకు మంజూరైనట్లు ఆయన వివరించారు. ఈనిధులను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నాణ్యత తగ్గకుండా పనుల నిర్వహణలో పర్యవేక్షణ చేయాలని ఆయన కోరారు.

గ్రామీణులకు వరం చంద్రన్న విలేజ్‌మాల్

* ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన

కూచిపూడి, జూన్ 1: మొవ్వ మండలం భట్లపెనుమర్రులో శుక్రవారం చంద్రన్న విలేజ్‌మాల్‌ను పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రారంభించారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న బియ్యం, పంచదార, కందిపప్పులతో పాటు నూనెలు, సబ్బులు, చింతపండు, బెల్లం తదితర 100 రకాల నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ధరకు అందచేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాల ఫలితమేనని ఎమ్మెల్యే కల్పన పేర్కొన్నారు. ముఖ్యంగా కిలో రూ.60కి పైగా ఉన్న సోనా మసూరి బియ్యం రూ.45లకే అందచేయటం జరుగుతుందన్నారు. చంద్రన్నమాల్‌లో 250 రకాలు విక్రయించాల్సి ఉండగా తొలుత 100 రకాలు సిద్ధపర్చిన డీలర్ పివి కోటేశ్వరరావు అభినందనీయుడన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిలారపు మంగమ్మ, తహశీల్దార్ బి రామానాయక్, గ్రామ సర్పంచ్ కొడాలి దయాకర్, మాజీ సర్పంచ్ గొట్టిపాటి వెంకట్రావ్, డీటీ సులోచన, మేకా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.