క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 2: ఓ కోల్డ్‌స్టోరేజీ యజమాని వద్ద లంచం తీసుకుంటుండగా గుంటూరు ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కె కేశవరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం, నందిగామ గ్రామంలో గుదే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోల్డ్‌స్టోరేజీ నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని కారణంగా గత కొద్దిరోజుల క్రితం షోకాజ్ నోటీసు జారీచేశారు. దీంతో వెంకటేశ్వరరావు ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు లక్ష రూపాయలు లంచంగా ముట్టచెబితే ప్లాన్ అప్రూవల్‌తోపాటు షోకాజ్ నోటీసును పరిష్కరిస్తామని కేశవరావు డిమాండ్ చేశారు. 50వేలు మాత్రమే ఇచ్చుకోగలనని వెంకటేశ్వరరావు ప్రాధేయపడ్డాడు. ఇందుకు అంగీకరించిన కేశవరావు శనివారం తన కార్యాలయంలో నగదు అప్పగించాలని సూచించాడు. ఏసీబీ అధికారులకు సమాచారం అందించిన వెంకటేశ్వరరావు ఒప్పందం ప్రకారం 50 వేల నగదును కేశవరావుకు అందిస్తుండగా ఏసీబీ డీఎస్‌పీ దేవానంద్ శాంతో ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచంగా ఇచ్చిన సొమ్మును స్వాధీనపర్చుకుని కేసు నమోదు చేశారు.

చిత్రం..ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కేశవరావు