రాష్ట్రీయం

ఆదర్శ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించారు. రాష్ట్ర నాలుగో అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ బంగారు తెలంగాణ దిశగా గత నాలుగేళ్ల నుండి బలమైన అడుగులు వేశామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ తీవ్రమైన అణచివేత, దోపిడీకి గురైందని గుర్తు చేశారు. ప్రజల్లో ఏర్పడ్డ నిరాశ, నిస్పృహలతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమై, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ప్రజల అవసరాలు, రాష్టప్రరిస్థితిపై అధ్యయనం చేసి 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళిక (మానిఫెస్టో) రూపొందించామని గుర్తు చేశారు. ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల పథకాలు, కార్యక్రమాల పట్ల దేశం యావత్తు దృష్టి నిలిపిందన్నారు. వివిధ రాష్ట్రాల నుండి ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన కమిటీలు తెలంగాణకు వచ్చి, వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు తీరుతెన్నుల పట్ల అధ్యయనం చేసి తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని వెల్లడించారు. 21 శాతం ఆదాయం వృద్ధితో దేశంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని వివరించారు. తెలంగాణ బిడ్డలుగా ఇందుకు మనం గర్వపడాలన్నారు. రాష్ట్ర ఖజానాకు సంపద వచ్చేలా చర్యలు తీసుకుని, ఈ సంపదను ప్రజలకు అందిస్తున్నామన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సుమారు 40 పథకాల ద్వారా 40 వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఏటా వినియోగిస్తున్నామన్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, గీతకార్మికులు తదితరులకు ఇస్తున్న పింఛన్ల వల్ల 42 లక్షల మంది లబ్దిపొందుతున్నారని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద పేద కుటుంబాల్లోని అడబిడ్డల పెళ్లిళ్ల కోసం 1,00,116 రూపాయలు ఇస్తున్నామని వెల్లడించారు. మంగలి, కుమ్మరి, కమ్మరి, చాకలి తదితర వృత్తుల వారు ఆధునిక పనిముట్లు కొనుగోలు చేసి ఉపాధి పొందేలా ఆర్థిక చేయూత ఇస్తున్నామన్నారు.
15 ఆగస్టు నుండి కంటిపరీక్షలు
వైద్యరంగంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు విప్లవం తీసుకువచ్చాయని సీఎం తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి కంటిపరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం జరిగితే 12 వేల రూపాయలు ఇస్తున్నామని, ఆడపిల్ల పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తున్నామని తెలిపారు. ఈ పథకాలతో సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగిందని, దాదాపు రెండులక్షల ప్రసవాలు జరిగాయన్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల వేతనాను గణనీయంగా పెంచామన్నారు. కిడ్నీబాధితులకోసం 17 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించామని, పెద్దదవాఖానాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసీయూ)ల సంఖ్యను పెంచామన్నారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ తదితర వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని, దాంతో ప్రజల్లో సర్కారు దవాఖానాల పట్ల నమ్మకం కుదిరిందన్నారు. కేజీ టు పీజీ విద్యను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో 296 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, వీటి సంఖ్యను 542కు పెంచామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం ఇస్తున్నామని, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామని, ఇటీవల జరిగిని సివిల్స్ పరీక్షల్లో మన రాష్ట్రానికి చెందిన అభ్యర్థి దేశంలోనే మొదటిస్థానం సంపాదించారని గుర్తు చేశారు. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్థికంగా చేయూత ఇస్తున్నామని వివరించారు.
చిత్రం..పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్