రాష్ట్రీయం

2886 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలో 2886 పోస్టల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా గ్రూప్-4 సహా పలు నోటిఫికేషన్లను పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది. 1521 పోస్టులకు గ్రూప్-4 నోటిఫికేషన్ సహా 700 పోస్టులకు వీఆర్వో, ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు, 19 సీనియర్ స్టెనో ఉద్యోగాలకు, 474 మండల ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఆయా పరీక్షల అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, ఇతర వివరాలను కమిషన్ ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు 7వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు.
అక్టోబర్ 7న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఆఫ్‌లైన్‌లోనూ, తక్కువ వస్తే ఆన్‌లైన్‌లోనూ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే మండల ప్రణాళికాధికారి పోస్టులకు 8వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16న పరీక్ష నిర్వహిస్తారు. రెవిన్యూ, హోంశాఖల్లో 19 స్టెనో ఉద్యోగాలకు 11 నుండి సెప్టెంబర్ 2 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు.