రాష్ట్రీయం

యాంత్రికీకరణపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: సాంప్రదాయ పద్ధతిలో సాగుతున్న వ్యవసాయాన్ని యాంత్రీకరణ విధానంలోకి తేవాలని సీఎం కే.చంద్రశేఖర్ రావు సూచించారు. శనివారం ప్రగతి భవన్‌లో వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితుల అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, బాల్క సుమన్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారథిలతో ప్రత్యేకంగా చర్చించారు. వ్యవసాయానికి ఎంతో చేస్తున్నా ఆధునిక పద్ధతుల్లో సాగక పోవడంతో ఇబ్బందులు ఉన్నాయన్నారు.
సాగుకు ఆధునికతను జోడిస్తే రైతుల భవిష్యత్ ఉజ్వలం అవుతుందన్నారు. వ్యవసాయ ప్రగతిలో ఏఈవోల పాత్ర కీలకమని, వారు అధికారుల్లా కాకుండా ప్రోత్సాహకర్తల్లా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ విస్తరణాధికారులు ఏ పంట ఎప్పుడు వేయాలో, భూమికి ఏ పంట అనుకూలమో, ఏది వేస్తే మంచిదో అన్న విషయాలను రైతులకు తెలియజేయాలని సూచించారు. కేవలం పంటలపై సమాచారం అందించి వదిలివేయకుండా పండిన పంటకు రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల మార్కెటింగ్ సౌకర్యాల ఏర్పాట్లను కూడా ఏఈవోలు పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్రం మొత్తం ప్రతి మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ ముమ్మరంగా సాగేలా చూడాలన్నారు. ఆధునిక యంత్రాలు ప్రతీ రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే బడ్జెట్‌లో యాంత్రీకరణకు నిధులుంటాయని పేర్కొన్నారు. వీటితో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించి సమగ్ర సమాచారంతో రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రి సంతకంతో ప్రతి రైతుకూ లేఖలు రాయాలని సూచించారు.

చిత్రం..వ్యవసాయంపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్