విశాఖ

రాజకీయ పరిపక్వత లేకనే విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూన్ 18: రాజకీయ పరిపక్వత లేని కొంతమంది నాయకులు తనపై, తమ పార్టీపై అర్థరహిత విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారని ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు విమర్శించారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిధి గృహం ప్రాంగణంలో నియోజకవర్గం విస్తృతస్థాయి దేశం పార్టీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విశాఖ మన్యం స్థితిగతులపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో జరుగుతున్న కుట్ర రాజకీయాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో దేశం పార్టీని ఓడించడానికి వ్యూహం పన్నుతున్న పాత్రదారులు, కుట్ర దారులకు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తన ఎదుగుదలను చూడలేని వారంతా ఈర్షతో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై, తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నాయకులు అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాలు చేసారు. అరకులోయ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్టు ఆయన చెప్పారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా చూడాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో దేశం పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని, పార్టీ పటిష్టత కోసం శక్తివంచన లేకుండా అందరూ పనిచేయాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు ఏకపక్షం కావాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. మహాత్మగాంధీ కలలుగన్న స్వరాజ్యం సాధించాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న బహుళార్థ సాధక పథకం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రత్యేక బస్సులో నియోజకవర్గం ప్రజలకు తీసుకువెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులపై వస్తున్న వందతుల్లో వాస్తవం లేదని తెలియచేప్పేందుకే పోలవరం సందర్శనకు ఏర్పాట్లు చేసినట్టు సర్వేశ్వరరావు చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ కొట్యాడ అప్పారావు, జెడ్పీటీసీ కూన వనజ, ఎం.పి.పి. కె.అరుణకుమారి, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన దేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.