రాష్ట్రీయం

హైకోర్టుకు విద్యుత్ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: విద్యుత్ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జరిగాయని సంబంధిత ఉద్యోగులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ధర్మాసనం ఫిర్యాదుపై విచారించిన అనంతరం సోమవారం నాటికి కేసును వాయిదా వేసింది. సంస్థలో పని చేస్తున్న ఏడీఈ (విద్యుత్) స్థాయి అధికారి కోటేశ్వరరావుకోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ యాజమాన్యం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు సూచించిన మ్గాదర్శకాలను కాదని, యాజమాన్యం ఇష్టానుసారంగా బదిలీలను చేపట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడేళ్ళ పాటు నిర్ధేశించిన ప్రాంతంలో పని చేసిన సదరు ఉద్యోగి బదిలీని పక్కనపెట్టి రెండేళ్ళు పూర్తి చేసుకున్న ఉద్యోగికి బదిలీ ఉత్తర్వులు జారీ చేయడమేమిటని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యానికి అనుకూలంగా ఉన్న ఉద్యోగులను ప్రాధాన్యత ప్రాంతాలకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. బదిలీల్లో ముడుపులు ఇచ్చిన వారికి కోరుకున్న ప్రాంతాలకు యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. మా ఫిర్యాదుకు ఆధారాలు ఉన్నాయని ఈడీఈ కోటేశ్వరరావు తెలిపారు.
పారదర్శకత పాటించాం..
తమ సంస్థ ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రఘుమారెడ్డి తెలిపారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విషయాలను పారదర్శకంగా చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.