ఐడియా

చక్కటి ఆరోగ్యం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఎంత బిజీగా ఉన్నా, శరీరమనే యంత్రంలోని అన్ని అవయవాలూ మనకు సహకరించాలంటే తప్పక ఆహారం తీసుకోవాలి. దానిని సరైన పాళ్లలో, సరైన సమయంలో తీసుకోవాలి. ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినడం వల్ల ఆరోగ్యానికి మంచి కన్నా కీడే ఎక్కువ. తగిన ఆహార నియమాలను పాటిస్తే చక్కటి ఆరోగ్యాన్ని సులభంగా పొందవచ్చు.
- సమయం మించిన తరువాత తినటం మంచిది కాదు. అకాల భోజనం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాక జీర్ణకోశ సంబంధమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ప్రతిరోజూ కచ్చితమైన సమయంలో ఆహారం తీసుకుంటే చక్కటి ఆరోగ్యం మన సొంతం.
- భోజనానికి ముందు టీ, కాఫీ లాంటివి తీసుకుంటే ఆకలి మందగిస్తుంది.
- ఎంత ఆహారం తీసుకోవాలనే దానికి ప్రామాణికత ఏమీ లేదు. ఆకలి స్థాయిని, వయసును బట్టి తగినంత ఆహారం తీసుకోవాలి. రోజూ ఒక నియమిత స్థాయిని పాటించడం మంచిది. భోజనం రుచిగా లేనపుడు తక్కువగానూ, రుచిగా ఉంటే భారీగానూ తీసుకుంటే సమతుల్యత దెబ్బతింటుంది.జిహ్వ చాపల్యాన్ని అదుపులో వుంచుకోవాలి.