ఆరోగ్య భాగ్యం

గర్భిణులు-మానసిక ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార విహార నియమాలు, నిబంధనలు చాలామందికి తెలుసు. తెలియని వారు వారి కుటుంబంలోని పెద్దవారి వల్లను, వైద్యుల వల్లనూ గ్రహించి ఆ విధంగా నడచుకుంటారు. కాని చేయకూడనివి చాలామందికి తెలియవు. అలాగే మందులు బలానికి గాని, జ్వరం, ఇన్‌ఫెక్షన్స్ వంటి జబ్బులకి గాని స్ర్తిలు వేసుకోవలసి వస్తుంది. వాటిలో కొన్ని కడుపులోని శిశువుకు అపాయం కల్గించవచ్చు. కొన్ని పరీక్షలు గర్భిణికి చేయవలసి వస్తే లేత నెలలలో వాటిని వాయిదా వేయాలి. ఉదాహరణకు ఎక్స్‌రే, దంత వైద్యం వంటివి జాగ్రత్తగా అమలు చేయాలి. అతిగా వ్యాయామం చేసినా దూరదూరాలు వాకింగ్, జాగింగ్ చేసినా శ్రమ వల్ల ఒంట్లోని కండరాలకి గ్లూకోజు తగ్గి క్రాంప్స్ అంటే పిక్కలు, తొడలు గట్టిగా పట్టుకునిపోయి నడవలేకుండా అయిపోతారు. కాళ్లు ముఖ్యంగా మడిమలు స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
దూర ప్రయాణాలు కూడా మంచివి కాదు. రైలుగాని, బస్సు గాని అయితే కుదుపులకి ఒళ్లునెప్పులు, నీరసం, క్రాంప్స్ రావచ్చు.
స్కూటర్ నడపడం గాని, వెనకగాని కూర్చుంటే గర్భిణికి శ్రమ, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్లవలసి వస్తే కారులో వెళితే మంచిది. 4-5 గంటలు కూర్చుంటే కాళ్లవాపులు వస్తాయి. స్కూటర్ మీద ఒకవైపుగా కూర్చోరాదు. తలకి హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తే ప్రమాదం వీరికి ఎక్కువ. ఎందుకంటే వెనక బరువు ఎక్కువగా వుంటే బండి బాలెన్స్ తప్పుతుంది. కాబట్టి బాధ్యతగల పెద్దవారు జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకొని వెళ్లాలి. ఒళ్లో సామాన్లు లేక చంటిపిల్లల్ని కూర్చోబెట్టుకుని స్కూటర్‌పై వెళ్లరాదు. ప్రయాణాలు తప్పనిసరి అయితే తాగడానికి ఇంటి నుంచి మంచినీరు, అన్ని రకాల పళ్లు, ఇంట్లో చేసిన తినుబండారాలు, గ్లూకోజ్ పొట్లాలు పట్టుకుని ప్రయాణించాలి. ప్రతి 2 గంటలకు ఏదో ఒక ఆహారం లేక పండురసం, గ్లూకోజు, మజ్జిగ, కొబ్బరి బోండాల నీరు, బిస్కెట్లు తీసుకోవచ్చు.
తల దగ్గర సెల్‌ఫోన్లు పెట్టుకుని పడుకోరాదు. ఎలక్ట్రిక్ సామాన్లు, ప్లగ్గులు వేరే వాళ్లతో ఉపయోగించాలి. టీవీలో సినిమాలలో వచ్చే భయంకర దయ్యాల సినిమాలు, ఎక్కువ క్రూరకృత్యాలు చూడవద్దు. దీనితో మానసిక శాంతి కొరవడి గుండె దడ, ఆయాసం, దిగులు లాంటివి వేధిస్తాయి.
యోగా చేసినా సులువైన ఊపిరితిత్తుల వ్యాయామం లేక కాళ్లు చేతులు వేళ్లు కదిలించే వ్యాయామాలే చేయాలి. అలసిపోయి చెమట పట్టేదాకా చేయనవసరం లేదు. అలవోకగా సంతోషంగా సౌకర్యంగా వుండే వ్యాయామాలు చేయాలి.
ఇక మందులలో ముఖ్యంగా వాడకూడనివి - టెట్రాసైక్లిన్, క్లోరోమైసిన్, ఫ్లాజిల్, క్వినొలిస్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ తీసుకోకూడదు.
*
ప్రశ్న: నా వయస్సు 92 సంవత్సరాలు. దగ్గు తగ్గట్లేదు. ఏం చేయాలో చెప్పగలరు?
-కె. పట్ట్భా రామచంద్రరావు, యనమలకుదురు
జవాబు: అయ్యా! మీ వయస్సు 92 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు ఊపిరితిత్తులు బలహీనపడి ఇనె్ఫక్షన్లు సోకుతాయి. మీరు చేయాల్సిన పనులు: 1. శ్వాసకోశ వ్యాయామం.. ఇది రోజూ చేయాలి. 2. దగ్గుకఫం కల్చరు పరీక్ష.. 3. తగిన యాంటీబయాటిక్స్ వాడడం.. 4. ప్రతి ఏడూ చలికాలం మొదట్లో న్యుమోనియా వాక్సీను తీసుకోవాలి.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో