మిర్చిమసాలా

తోడల్లుడి సందడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో- ఇన్నాళ్లూ కనుమరుగైన కొందరు నేతలు ఆకస్మికంగా తెరపైకి వస్తూ హడావుడి చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత మీడియా ముందుకొచ్చి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మీడి యా సమావేశం జరుగుతున్నంత సేపూ ఒకటే ఉత్కంఠ! దగ్గుబాటి తన తోడల్లుడు చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెడతారన్న ఆసక్తి అటు తెదేపాలోనూ నెలకొంది. బాబు పాలనపై ఆయన సంచలనాత్మక వ్యాఖ్యలు చేయకపోయినా, కొంతమేరకు తన అసంతృప్తిని మాత్రం బయటపెట్టారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనని స్పష్టం చేసిన దగ్గుబాటి మీడియా ప్రతినిధులు ఎంత సూటిగా ప్రశ్నించినా- సాదాసీదాగానే సమాధానాలు చెప్పడంతో తెదేపా వర్గాలు మాత్రం ఊపిరి పీల్చుకున్నాయి.
-నిమ్మరాజు చలపతిరావు
దానయ్యలతో జాగ్రత్త!

‘దారిన పోయే దానయ్యల’తో పారాహుషార్! దానయ్యే మీ ఇంటికి వచ్చి, తాను దేశానికి రాజునని చెబితే మీరు ఏం చేస్తారు? వెంటనే అతగాడిని బయటకు గెంటేస్తారు. అవునా..? కానీ, మెక్సికోలో ఒక ప్రముఖ హోటల్‌కు ఓ దానయ్య తన కుమారునితో వెళ్ళాడు. గదులు ఖాళీగా లేవని సిబ్బంది చెప్పడంతో సదరు దానయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేను ఈ దేశానికి ప్రధానిని’ అని చెప్పడంతో వారు కంగుతిని, వెంటనే రాచమర్యాదలు చేశారు. సెల్ఫీలు దిగారు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. ఆ దానయ్య మర్నాడు గది ఖాళీ చేసి డబ్బులు చెల్లించకుండా వెళ్ళిపోయాడు. ఆ సెల్ఫీలను వాట్సాప్‌లో పెట్టడంతో, సదరు దానయ్య ప్రధాని కాదంటూ నెటిజన్లు తేల్చి చెప్పారు. ప్రముఖ హోటల్ వారికే ఆ దేశ ప్రధాని ఎవరో తెలియదా? అంటూ అక్కడి ప్రజలు కనె్నర్ర చేశారట. కాబట్టి దారినపోయే దానయ్యలతో జాగ్రత్త!
-వి.ఈశ్వర్ రెడ్డి

దశావతారాలు..
ఓవైపు ప్రజా సమస్యలను చక్కదిద్దడం, మరోవైపు తన కుటుంబంతో గడిపేందుకు సమయం కేటాయించడం.. విజయవాడలో కొత్త ఇంట్లో గృహప్రవేశం.. అదే సమయంలో హైదరాబాద్‌లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం.. ఇలా దశావతారాలను ప్రదర్శిస్తున్న ‘జనసేన’ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తాజాగా విజయవాడలో జరిగిన ‘దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ’ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఇంతవరకూ అంతా ఓకే అయినా- మొత్తం ‘ట్విస్ట్’ అంతా అక్కడే ఉంది. నిన్నటి వరకూ ఏపీ సీఎం చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌పై అవినీతికి సంబంధించి బహిరంగ విమర్శలు చేసిన పవన్ అవన్నీ మరచిపోయ, ఏకాంతంగా చంద్రబాబుతో చర్చలు జరపడం సంచలనం సృష్టించింది. ఈ చర్చలకు సచ్చిదానంద స్వామి మధ్యవర్తిగా ఉండటంతో ఏం జరిగిందబ్బా? అంటూ ఇరు పార్టీల నేతలూ చెవులు కొరుక్కుంటున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన, వైకాపాలు జతకలుస్తాయన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో టీడీపీ, జనసేన అధినేతల భేటీ ఎన్నో ఊహలకు తావిచ్చింది.
- బీవీ ప్రసాద్