క్రైమ్/లీగల్

రైలు దోపిడీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: దక్షిణ మధ్య రైల్వే (దమరై) పరిధిలోని పర్లీ-లాతూర్ సెక్షన్‌లో పన్‌గాన్ రైల్వే స్టేషన్ సమీపంలో 20 నుంచి 25 మంది దొంగలు ఔరంగాబాద్-రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌ను దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రతిఘటించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దీనితో వారు రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం తెల్లవారు జామున 3.07 గంటలకు జరిగింది. సెక్షన్‌లోని పన్‌గాన్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ 233 కిలో మీటర్ వద్ద దొంగలు సిగ్నల్‌ను టాంపరింగ్ చేసి రైలు నిలిచిపోయేలా చేశారు. అనంతరం రైల్లో చొరబడి దోచుకునేందుకు ప్రయత్నించారు. రైలు ఔటర్ సిగ్నల్ వద్ద కారణం లేకుండా నిలిచిపోవడంతో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) ప్రయాణికులను బోగీల కిటికీలను కిందకు దించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దొంగలు రైల్లో మూకుమ్మడి దోపిడీకి పాల్పడాలని పథకం వేశారు. అయితే, దీనిని గమనించిన రైలుకు ఉన్న ఆర్పీఎఫ్ ఎస్కార్ట్ పార్టీ ఒక్కసారిగా విజిల్స్ వేస్తూ ప్రయాణికులను నిద్రలేపి కిటికీలు మూసివేసేలా చేశారు. దొంగల ప్రయత్నాన్ని తిప్పికొడుతూ వారిపై టార్చ్ లైట్ల వెలుతురు పడేలా చేయడం ద్వారా వారిని ఆర్పీఎఫ్ సిబ్బంది ఎదుర్కొన్నారు. దొంగల ముఠాకు రైలును లూటీ చేసే అవకాశం చేజారిపోవడంతో ఒక్కసారిగా రైలుపై రాళ్లదాడికి దిగింది. అయితే అందరూ అప్పటికే అప్రమత్తం కావడంతో రైలుపై విసిరిన రాళ్ల వల్ల ఏ ఒక్క ప్రయాణికుడికి చిన్న గాయం కూడా కాలేదు. వస్తువులన్నీ భద్రంగానే ఉన్నాయి. సుమారు 36 నిమిషాల పాటు దొంగలు, ఆర్పీఎఫ్ మధ్య ప్రతిఘటన జరిగింది. అనంతరం 3.43 గంటలకు రైలు భద్రంగా బయలుదేరి వెళ్లిందని దమరై వర్గాలు శనివారం వెల్లడించాయి. సంఘటన ప్రదేశాన్ని లాతూర్ అదనపు ఎస్పీ, పన్‌గాన్ రైల్వే స్టేషన్ స్ధానిక పోలీసులు హుటాహుటిన వచ్చి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ రామకృష్ణ సంఘటన పరిస్థితిని సమీక్షించారు.