రాష్ట్రీయం

పట్టుదలతో హోదా సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 1: పట్టుదలతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దామని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపిచ్చారు. సత్సంకల్పం, దీక్ష, పట్టుదల ఉంటే కేన్సర్‌ను జయించవచ్చని అన్నారు. రాజధాని నగరం అమరావతిలో సీఎం చంద్రబాబు అందచేసిన 15ఎకరాల భూమిలో వెయ్యి పడకల కేన్సర్ ఆసుపత్రికి మరో నెలరోజుల్లో శంకుస్థాపన చేసి సరిగ్గా 15నెలల్లో ప్రారంభించి ఆంధ్ర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. దేశంలోని అతిపెద్ద కేన్సర్ చికిత్సా కేంద్రంగా పేరుగాంచిన బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన క్లినిక్, ప్రధాన సమాచార కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి బాలకృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేన్సర్‌తో తన తల్లి పడిన బాధను కళ్లారా చూసిన తండ్రి దివంగత నందమూరి తారక రామారావు అలాంటి బాధలు మరెవరికీ రాకూడదని భావించి 1989లోనే కేన్సర్ ఆసుపత్రికి భూమిపూజ చేశారని చెప్పారు. తమవద్ద ఆర్థిక వనరులు లేకపోవటం, పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవటం వల్ల పదేళ్లపాటు ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు బృహత్తర సంకల్పంతో పూర్తిచేసి నాటి ప్రధాని వాజపేయి చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయించి జాతికి అంకితం చేయించారన్నారు. ఇందుకు రతన్ టాటా ట్రస్ట్ మొదలుకుని ఎందరో దాతలు ఆర్థిక సహకారం అందించారన్నారు. ప్రస్తుతం రోజూ 7వేల మంది కిమోథెరపీ చికిత్స పొందుతున్నారంటే ఆసుపత్రి ఎంతగా అభివృద్ధి చెందిందో ఇట్టే తెలుస్తుందన్నారు. వచ్చిన వారిని రోగిలా కాకుండా ఓ అతిథిగా అక్కడ గౌరవిస్తూ చికిత్స అందిస్తున్నామన్నారు. తన తండ్రి తనను డాక్టర్‌గా చూడాలనుకున్నా యాక్టరైనప్పటికీ ఆసుపత్రి చైర్మన్ హోదాలో ఎందరో పేదలకు వైద్య సహాయం అందించే మహత్తర అవకాశం లభించిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా 10లక్షల మంది కేన్సర్‌కు గురై ఏడున్నర లక్షల మంది మరణిస్తున్నారని ఆయన తెలిపారు. కేన్సర్‌కు అనేక కారణాలున్నాయని, అయితే అనేక మంది భయంతోటే అర్థంతరంగా మరణిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తపరిచారు. మానసిక ధైర్యంతో మహమ్మారి కేన్సర్‌ను జయించాలన్నారు. త్వరలోనే విశాఖ, తిరుపతి అలాగే తెలంగాణలో వరంగల్, కరీంనగర్‌లో కూడా క్లినిక్‌లు ప్రారంభిస్తామని ప్రకటించారు. దాదాపు రెండు కోట్లు వెచ్చించి అత్యాధునిక పరికరాలతో మొబైల్ వ్యాన్‌ను సిద్ధం చేసి గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తామని కూడా బాలకృష్ణ తెలిపారు.
ఆసుపత్రి డైరెక్టర్, శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ దేశ విదేశాల్లోని దాతలు, అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వల్ల ఆసుపత్రి సేవలకు గాను అనేక అవార్డులు సాధించగల్గుతున్నామన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుపుతున్నామన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ ఆసుపత్రి అమరావతి ముంగిటకు చేరిందన్నారు. సభలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కల్పన రఘునాథ్, సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకరరావు కూడా మాట్లాడారు.
చిత్రం..కేన్సర్ క్లినిక్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న నందమూరి బాలకృష్ణ