అంతర్జాతీయం

ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిర్‌కుక్, జూలై 1: ఇరాన్‌లోని ఒక గిడ్డంగిలో ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లను ధ్వంసం చేయడం లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు ఉన్నారు. ఉత్తర బాగ్దాద్‌లోని కిర్‌కుక్‌లో ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లు లక్ష్యంగా కారులో వచ్చిన ఆత్మాహుతి దళం వారు గిడ్డంగి మెయిన్‌గేట్‌ను ఢీకొట్టారు. ఈ సందర్భంగా జరిగిన పేలుడులో మొత్తం 19 మంది గాయపడ్డారని, భవనం దెబ్బతిందని, అయితే బ్యాలెట్ బాక్స్‌లకు ఎలాంటి నష్టం జరగలేదని గవర్నర్ రబన్ ఆల్ జుబారి తెలిపారు. మేలో జరిగిన లెజిస్లేటివ్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల మేరకు ఆయా ప్రాంతాల్లో పోలైన ఓట్లను రీకౌంట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్‌లను పటిష్ట భద్రత మధ్య ఉంచారు. కాగా బ్యాలెట్ బాక్స్‌లు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ ఓట్ల రీకౌంట్ మంగళవారం జరగనున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.