జాతీయ వార్తలు

పౌరుడిని రక్షించడంలో నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూలై 1: వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడంలో నిర్లక్ష్యంగా గురించి తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టించిన ఒక అధికారి జీతంలో కోత విధించడమే కాకుండా, అతడిని అటాచ్ చేస్తున్నట్టు పూంచ్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ అజాజ్ అసద్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఊరు వదిలి వెళ్లరాదని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సురాన్ నదికి వచ్చిన వరదల్లో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడని, వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని పూంజ్ జిల్లాలోని తహశీల్దార్‌కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అధికారుల ఆదేశాల మేరకు అరగంటలో సంఘటనా స్థలానికి చేరుకోవాల్సిన ఆ అధికారి తాత్సారం చేసి కొన్ని గంటల సమయం తర్వాత తాపీగా అక్కడికి చేరుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి వరదనీటిలో కొట్టుకుపోయి మృతి చెందడమే కాక, అతని మృతదేహం గాలింపులో పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనిపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఒక అధికారి, ముఖ్యంగా పౌరుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. తహశీల్దార్ నిర్లక్ష్యాన్ని తప్పుగా పరిగణిస్తూ అతడిని అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అతని జీతాన్ని నిలిపివేశారు. వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఫజాలాబాద్‌కు చెందిన బాధితుడు అంజర్ అహ్మద్ కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం విడుదల చేశారు.