విజయనగరం

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియ్యమ్మవలస, జూలై 3: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు వైద్యాధికారి సి పద్మజ కోరారు. మంగళవారం మండలంలో గల చినమేరంగి 30పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో జియ్యమ్మవలస, రావాడ రామభద్రపురం, గరుగుబిల్లి, రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశావర్కర్లు తక్షణ సహాయ సహకారాలను రోగుకు అందించాలన్నారు. వైద్య సిబ్బంది రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాలన్నారు. ఈ ఔషది ఆన్‌లైన్ చేయడంలో వెనుకబడి ఉన్నారని, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. గర్భిణీలలో ఐరిస్క్ కేసులు నమోదవుతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. గ్రామాల్లో వైద్యసిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ తక్షణ వైద్యసేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శిరీష, ఎంపీహెచ్‌ఇఓ తిరుపతిరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయ కొత్త్భవన నిర్మాణ స్థలం ఇదే
పార్వతీపురం, జూలై 3: పార్వతీపురం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో కొత్తగా ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.కోటితో నిర్మాణం చేపట్టనున్న ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థల నమూనాను ఆర్ అండ్ బి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆర్డీవో కార్యాయ ఆవరణలోనే ఉన్న పాత భారీ వృక్షాన్ని కూడా ఈమేరకు తొలగించడంతో పాటు అక్కడే ఉన్న పాత హౌసింగ్‌శాఖ భవనాన్ని తొలగించనున్నారు. ఈప్రదేశంలో నూతన భవన నిర్మాణానికి అధికారులు తమ చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఆర్డీవో కార్యాలయంలో సిబ్బంది, ఉద్యోగుల కోసం దాదాపు ఐదేళ్ల క్రితం ఇక్కడ ఒక భవనం నిర్మించినా అది చాలీచాలనిదిగా ఉంటోంది.అంతేకాకుండా ఆర్డీవోకు విధుల నిర్వహణకు అవసరమయ్యే కార్యాలయం లేకపోవడంతో పురాతన భవనంలోనే ఆర్డీవో విధులు నిర్వహిస్తున్నారు. ఈభవనం బ్రిటిష్ కాలం నాటిది కావడంతో ఎప్పుడు కూలిపోతోందోనని ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే కొత్త భవన నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు.