విజయనగరం

బీజామృతంతో సామూహిక విత్తనశుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), జూలై 3: బీజామృతంతో సామూహిక విత్తనశుద్ధి చేపట్టడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి మజ్జి శ్యాంసుందర్ అన్నారు. మండలం నారాయణప్పవలస, కాశిందొరవలస పంచాయతీలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విధంగా చేయడం వలన విత్తనాల ద్వారా వ్యాప్తిచెందే తెగుళ్లును అరికట్టవచ్చునన్నారు. దీని వలన విత్తనం మొలకెత్తి ఆరోగ్యకరమైన నారు పెరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ సూచనలు, సలహాలను విధిగా పాటించాలన్నారు. వ్యవసాయ పరంగా రైతులకు ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే రైతులకు అవసరమైన వరి విత్తనాలను పంపిణీ చేశామన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులను అన్నివిధాలా చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోవిందతోపాటు ఏఇఓలు జోగినాయుడు, మాజీ ఎంపీటీసీ గేదెల కోటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

ఏఓలుగా పదోన్నతులు పొందిన వారికి ఘన సన్మానం
సీతానగరం, జూలై 3: మండలంలో వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారులుగా పనిచేసి వ్యవసాయ అధికారులుగా పదోన్నతులు పొందిన పాలతీర్థం కిరణ్‌కుమార్, ఎస్ అవినాస్, వి శైలజలను మండల అధికారులు, ప్రజాప్రతినిదులు, రైతులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈమేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వీరికి అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారుల సంఘం కార్యదర్శి మోపాడ ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ మండలంలో వ్యవసాయశాఖకు పేరుప్రతిష్టలు రావడానికి వీరి పనితీరు కూడా ఒక కారణమన్నారు. కష్టపడి పనిచేసేవారికి ఎక్కడైన తగిన గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం తరుపున వీరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంపీపీ శనపతి విజయలక్ష్మి, జడ్పిటీసీ తెంటు సావిత్రమ్మలు మాట్లాడుతూ సీతానగరంలో పనిచేసిన ముగ్గురికి ఒకేసారి మండలస్థాయి పదోన్నతులు లభించడం గర్వకారణమన్నారు. సన్మానగ్రహితలు మాట్లాడుతూ వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో పనిచేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఆయన సలహాలు, సూచనలు భవిష్యత్‌లో తమకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీతానగరం మండలంలో అందరి సహకారంతోనే తమ విదులను సక్రమంగా నిర్వహించామన్నారు. ఈ మేరకు కిరణ్‌కుమార్, శైలజ, అవినాస్‌లకు దుస్సాలువాతో కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, తహశీల్దార్ గణేష్, వైస్ ఎంపీపీ బోను సత్యనారాయణ, సీడీసీ ఛైర్మన్ కె కిశోర్‌కుమార్, ఎస్ హరిగోపాలరావు, తెంటు వెంకటప్పలనాయుడు, వ్యవసాయశాఖ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.