విజయనగరం

ఇలా వచ్చారు....అలా వెళ్లారు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), జూలై 3: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామ ప్రజలకు ఎంతవరకు లబ్ధిచేకూర్చాయి, అదేవిధంగా ఎంతమందికి పథకాలు అందలేదు, తదితర వాటి వివరాలను తెలుసుకునేందుకు నీతి అయోగ్ కమిటీ పరిశీలకులు మండలంలో పర్యటించారు. అయితే మండలంలో ఒకేరోజు మంగళవారం 14 పంచాయతీలలో పర్యటించడంతో ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడమే తప్ప ఎక్కడా కూడా సమస్యలను తెలుసుకునే పరిస్థితి కనిపించలేదు. దీంతో చాలామంది ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే ముందుగా గ్రామాల్లో కూడా నీతి అయోగ్ కమిటీ వస్తున్నట్లు సమాచారం లేకపోవడంతో ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది వృద్ధులు కూడా సమస్యలను చెప్పుకోవడానికి కారువద్దకు వెళ్లి మరీ మొరపెట్టుకున్నారు. ఒక్కొక్క పంచాయతీలో 15 నుంచి 20ని.ల మాత్రమే సమావేశాలను నిర్వహించి వెళ్లిపోయారు. మండలంలో పారాది, మెట్టవలస, ఎం బూర్జివలస, పెంట, కృష్ణాపురం, జగన్నాథపురం, కలువరాయి, చింతాడ, పక్కి, శివడవలస, కొండదేవుపల్లి, దిబ్బగుడివలస, గోపాలరాయుడుపేట, సిహెచ్ బొడ్డవలస పంచాయతీలో సమావేశాలను నిర్వహించారు. ప్రధానంగా ప్రధానమంత్రి ఉజ్వలయోజన, ప్రధానమంత్రి జన్‌ధన్ ఖాతాలు, ఎల్ ఇడీ బల్బులు, సురక్ష బీమా, ఇన్సూరెన్స్‌తోపాటు ఐసీడీఎస్‌కు సంబంధించి వివిధ పథకాలపై అడిగితెలుసుకున్నారు. అనంతరం నీతి అయోగ్ కమిటీ పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి(న్యూఢిల్లి) కెజి సురేష్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ఉండి ఎవరికైన పథకాలు అందని పక్షంలో మంజూరుచేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ అభివృద్ధి చెందేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె రామకృష్ణరాజు, ఇన్‌ఛార్జి డీఎల్‌పీఓ రాజు, సీఎస్‌డీటీ బాలమురళీ, కృష్ణ, ఏపీఓ కె కేశవరావు, ఏపీఎం ఈశ్వరరావుతోపాటు గ్రామ ప్రజాప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.
సాక్షరాభారత్ సమన్వయకర్తలను తక్షణమే నియమించాలి
బొబ్బిలి(రూరల్), జూలై 3: ప్రభుత్వం తొలగించిన మండల సాక్షరాభారత్ కో- ఆర్ఢినేటర్లు, సమన్వయకర్తలను తక్షణమే నియమించాలని మండల సాక్షరాభారత్ కో- ఆర్ఢినేటర్ ఆలవిల్లి వెంకటసుధాకర్ డిమాండ్ చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమన్వయకర్తలతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్న సమన్వయకర్తలను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వీరిని తక్షణమే నియమించేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై ఈనెల 6వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే వీరిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన సమన్వయకర్తలు పాల్గొన్నారు.