క్రీడాభూమి

ఎవరో.. ఆ నలుగురు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 4: నాటకీయ పరిణామాల మధ్య సాగిన నాకౌట్ రౌండ్ తుది మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి క్వార్టర్ ‘్ఫర్’కు తెరలేపింది. ఉండే నలుగురెవరో, ఊడే నలుగురెవరో తేల్చుకోడానికి ఎనిమిది జట్లు పదుమైన సాధన పూర్తి చేసుకుని పరుగులు తీస్తున్నాయి. నిజ్ని నోవ్‌గోరోడ్, కజన, సమర, ఫిష్ట్ మైదానాల్లో రెండు రోజుల పాటు (శుక్ర, శనివారం) సాగే రసవత్తర పోరు తిలకించేందుకు అభిమానులూ ఉరకలెత్తుతున్నారు. సత్తా ప్రదర్శించిన జట్లే సెమీస్‌లో అడుగుపెడతాయన్నది జగమెరిగిన సత్యం. కాకపోతే, ఆ సత్తా ఎవరు ప్రదర్శిస్తారన్నదే సాకర్ అభిమానుల మస్తిష్కాలను తొలుస్తున్న ప్రశ్న. పేవరేట్ హీరోలుగా బరిలోకి దిగిన జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్‌లాంటి మేటి జట్లు ప్రారంభంలోనే పరాభవంతో నిష్క్రమిస్తే.. బ్రెజిల్, ఫ్రాన్స్‌లాంటి దిగ్గజ జట్లు సైతం చెమటోడ్ని క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. అసలేమాత్రం అంచనాలు లేని పసికూనలేమో కసికూనలుగా చెలరేగి సెమీస్‌పై నమ్మకాలు ప్రదర్శించడం చూస్తుంటే -్ఫఫా ప్రపంచ కప్ పోరు ఎంత రసవత్తరంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
కలిసొచ్చిన కాలాన్ని గోల్‌గా మలచుకుని కొలంబియాను ఇంటికి పంపేసిన ఇంగ్లాండ్ సమర మైదానంలో స్వీడన్‌తో తలపడనుంది. అతి కష్టంతో స్విట్జర్లాండ్‌పై 1-0తో విజయం సాధించిన స్వీడన్, ఇంగ్లాండ్‌ను ఏవిధంగా ఎదుర్కోబోతోందన్న ఆసక్తి కనిపిస్తోంది. ఈ రెండు జట్ల పటిష్టత ఆధారంగా సంభావ్యతా శాతాలను పరిశీలిస్తే ఇంగ్లాండ్‌కు 23 శాతం, స్వీడన్‌కు 48శాతం విజయావకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 29 శాతం మ్యాచ్ డ్రా అయ్యేందుకు అవకాశం లేకపోలేదు. నిజానికి ఈ రెండు జట్లూ తుది ఎనిమిది జాబితాలో కింది వరుసలోనే ఉన్నాయి. ఫిష్ట్ మైదానంలో తలపడబోతున్న రష్యా -క్రొయేషియా జట్లు సైతం కిందివరుసలోనే ఉన్నాయి. ఆతిథ్య దేశంగా అభిమానుల అండదండలతో అప్రతిహత ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్న రష్యా, దుర్భేధ్య రక్షణశ్రేణితో దూసుకుపోతున్న క్రొయేషియాను ఢీకొనే మ్యాచ్‌పైనా ఆసక్తి కనిపిస్తోంది. గ్రూప్ మ్యాచ్‌లు, నాకౌట్ మ్యాచ్‌లో రెండు జట్లు ప్రదర్శించిన ప్రావీణ్యాన్ని బట్టి గెలుపోటములపై సంభావ్యతా శాతాన్ని పరిశీలిస్తే క్రొయేషియాకు 44 శాతం విజయావకాశాలు కనిపిస్తున్నాయి. 24శాతం విజయావకాశాలే రష్యా ఖాతాలో కనిపిస్తున్నా, సంచలనాల ఫిఫాలో ఏమైనా జరగొచ్చన్న లెక్కలూ లేకపోలేదు. 32 శాతం మ్యాచ్ డ్రాకు అవకాశాలు ఉన్నాయన్నది మరో అంచనా. తుది ఎనిమిదిలోని కింది నాలుగు జట్లలో ఒక్క ఇంగ్లాండ్ మాత్రమే మాజీ విజేత. మిగిలిన ముగ్గురికీ ప్రపంచ కప్ దిశగా పయనం తొలి అనుభవమే.
ఇక తుది ఎనిమిదిలోని మొదటి నాలుగు జట్లూ దిగ్గజాలే. రెండుసార్లు చాంపియన్స్ అనిపించుకున్న ఉరుగ్వేతో 1998 ప్రపంచ చాంపియన్ ఫ్రాన్స్ నిజ్ని నోవ్‌గోరోడ్ మైదానంలో శుక్రవారం తలపడబోతోంది. అలాగే తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోన్న బ్రెజిల్‌తో కజన మైదానంలో బెల్జియం తలపడబోతోంది. దిగ్గజ జట్ల సంభావ్యతా శాతాలు ఆసక్తికరమే. ఫ్రాన్స్‌కు 40, ఉరుగ్వేకు 24 శాతం విజయావకాశాలుంటే, మ్యాచ్ డ్రాకు 30శాతం అవకాశముంది. బ్రెజిల్‌కు 46, బెల్జియంకు 26 శాతం విజయావకాశాలుంటే, 28 శాతం మ్యాచ్ డ్రాకు చాన్స్ ఉంది.
ప్రపంచకప్ టోర్నీలో నాలుగోసారి తలపడుతున్న ఇంగ్లాండ్, ఎరిక్ డయర్ అందించిన అనూహ్య షూటౌట్ గోల్‌తో అండర్ డాగ్‌గా మారబోతోందా? ఇంగ్లాండ్ జట్టు అంత నమ్మకంతోనూ కనిపిస్తోంది. ‘సమర ప్రాంగణంలో స్వీడన్‌ను అధిగమించటం ఖాయం. రష్యా-క్రొయేషియా మ్యాచ్‌లో విజయం సాధించే జట్టుతో సెమీ ఫైనల్స్‌లో ఎలా తలపడాలన్న అంశంపైనే మా దృష్టి ఉంది’ అంటూ కోచ్ సౌత్‌గేట్ చెబుతున్నాడంటే, మ్యాచ్ గెలుపుపై ఇంగ్లాండ్ ఎంత నమ్మకంతోవుందో అర్థమవుతుంది. ‘స్వీడన్‌తో పోల్చుకుంటే మా రికార్డులు చాలా తక్కువ. ఏళ్ల తరబడి వాళ్లను తక్కువ అంచనా వేస్తూ వచ్చాం. వాళ్ల కథను వాళ్లే రాసుకుని చరిత్రను సృష్టించుకున్నారు. ఆ చరిత్రను పునరావృతం కానివ్వను’ అంటున్నాడు సౌత్‌గేట్. గ్రూప్ మ్యాచ్‌ల్లో జర్మనీ చేతిలో ఖంగుతిన్న స్వీడన్ వెంటనే తేరుకుని మెక్సికో, స్విట్జర్లాండ్ జట్ల అంతుచూసి తన సత్తాను చాటుకుంది. 1994 తరువాత మళ్లీ క్వార్టర్స్‌కు చేరుకున్న స్వీడన్, ఇప్పుడీ అవకాశాన్ని చేజార్చుకోడానికి సిద్ధంగా లేదు. ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించడమే లక్ష్యంగా స్వీడన్ బరిలోకి దిగుతోంది.
సెంటర్ అట్రాక్షన్ నేమర్, ఎంబప్పె
అరవీర భయంకరులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న బ్రెజిల్ స్ట్రయికర్ నేమర్, ఫ్రాన్స్ ఫార్వార్డ్ కిలియన్ ఎంబప్పెలు సెంటర్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. దీంతో కజాన్ మైదానంలో బ్రెజిల్ -బెల్జియం పోరు, నిజ్ని నోవ్‌గోరోడ్ మైదానంలో ఫ్రాన్స్ -ఉరుగ్వే పోరు రసవత్తరం కానుంది. ఆట ఆలస్యం చేస్తున్నాడంటూ విమర్శలు, మాయానైపుణ్యంతో ప్రశంసలు అందుకుంటున్న నేమర్‌పైనే బ్రెజిల్ ఆశలన్నీ ‘ఆరే’సుకుంది. అయితే, అత్యద్భుత రక్షణ శ్రేణితో దూసుకుపోతున్న బెల్జియం జట్టులో ఎడెన్ హజార్డ్, రొమేలు లుకాకు, డ్రైస్ మార్టెన్, కెవిన్ డె బుయ్‌నెలను ఎదుర్కోవడం బ్రెజిల్‌కు కత్తిమీద సామే. ‘పసికూనల్లా అడుగుపెట్టారు. కసికూనల్లా రెచ్చిపోతున్న జట్టును చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ ఉత్సాహం ఫస్ట్, సెకెండ్ స్థానాలకు తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు’ అంటూ బెల్జియం కోచ్ రోబెర్టో మార్టినెజ్ వ్యాఖ్యానించాడంటే బ్రెజిల్‌కు కొత్త సవాల్ తప్పదన్నట్టే. మరోపక్క అనూహ్య గోల్స్‌తో జట్టును పతాకస్థాయికి తీసుకొచ్చిన ఎంబప్పెపై ఫ్రాన్స్ ఆశలు చిగురిస్తున్నాయి. అత్యద్భుతో గోల్‌తో అర్జెంటీనాలాంటి దిగ్గజ జట్టునే ఇంటికి పంపేసిన ఎంబప్పె, ఉరుగ్వేతో పోరాటానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ‘ఇలాంటి ఆట కోసమే జట్టును నెలలు, వారాలపాటు పదునుపెట్టి తీసుకొచ్చింది’ అంటూ ఫ్రాన్స్ కోచ్ డిడెర్ డిస్‌చాంప్స్ అంటుంటే, తమ విజయావకాశాలు డిఫెన్స్‌పైనే ఉన్నాయంటూ ఉరుగ్వే అంటోంది. డిఫెండర్లు జోస్ గిమినెజ్, డైగో గోడిన్‌లు, స్ట్రైకర్లు లూయిస్ సురెజ్, ఎడిన్సన్ కవానిలు రాణిస్తే ఫ్రాన్స్ చీటీ చిరిగిపోవడం ఖాయమని ఉరుగ్వే భావిస్తోంది. షాక్‌లు, సంచలనాలకు వేదికైన ఫిఫా ప్రపంచకప్‌లో ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఉండే నలుగురెవరో, ఊడే నలుగురెవరో శుక్ర, శనివారాల్లో తేలిపోనుంది.