రాష్ట్రీయం

కావలిలో కన్నాపై చెప్పుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి/నెల్లూరు జూలై 4: కార్యకర్తల విస్తృత్త సమావేశంలో భాగంగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. అందులో భాగంగా కార్యకర్తలతో పట్టణంలోని బృందావనం కాలనీ నుంచి బీజేపి కార్యాలయం వరకు భారీగా ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ర్యాలీ గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకోగానే ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొర్రిపాటి ఉమామహేశ్వరావు అనే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులు విసిరి దాడికి దిగాడు. ఈ హఠాత్పరిణామానికి ఆగ్రహించిన నాయకులు, కార్యకర్తలు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బీజేపీ నాయకులు అతను ఎవరి అండతో అలా చేశారో చెప్పాలని పోలీసుస్టేషన్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.
రైల్వేజోన్ తప్పక వస్తుంది
రాష్ట్రానికి రైల్వేజోన్ తప్పక వస్తుందని, అన్ని అంశాలు పరిశీలించిన పిదప కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరులో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో పరిశీలించాలని పేర్కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూస్తూ సమయం ఉన్నప్పటికీ త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశముందన్నారు. అలాగే ఉక్కు పరిశ్రమ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తూ ప్రజల్ని టీడీపీ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. కేంద్రం అడిగిన వివరాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం వల్లనే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆలస్యం జరుగుతోందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ స్థలం చూపించలేకపోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.