వినమరుగైన

చత్వారాలు - చంపస్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. చిరాగ్గా ఇద్దరూ ఆటో దిగబోయారు.
‘‘ఆ! ఆ! దిగకండి. దగ్గరకొచ్చేశాం. మిమ్మల్ని దించే వెళ్తా! ఆటోకేం కాలేదు. సెల్ ఆఫ్ చేశా!’’ అన్నాడు ఆటోవాడు.
‘‘్ఛల్ చాల్లేవయ్యా! చెప్పొచ్చావ్. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ వాడకూడదని తెలీదా. బుద్ధిమంతుడిలా సెల్ నాకిచ్చినట్లే ఇచ్చి, తెలివిగా తీసుకున్నావ్’’ అంటూ కాంతమ్మగారితో సహా దిగేశారు, అతనికివ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి.
ఆ మధ్యనే మోజుపడి కొనుక్కున్న పట్టుచీర నిండా పిచ్చ పిచ్చవన్నీ పడి రంగే మారిపోయింది. కాంతమ్మ వేసుకున్న డై కూడా కనిపించకుండా పోయి తలంతా తెల్లబడింది. అహోబిలంగారు సరే సరి. ఆయన ప్యాంటూ, షర్టూ లాండ్రీకేసే స్టేజీలో వున్నయ్.
‘‘ఈ రోజుల్లో టీవీలు చూసి చూసీ చూసీ అందరికీ చత్వారాలు వస్తున్నయ్. ఈ సంబడానికి తోడు చంపస్వరాల్లా వదలకుండా ఈ సెల్ ఫోన్లు. ప్రమాదాలు జరుగుతున్నయ్యంటే జరగవు మరి. లేచిన వేళ మంచిదైంది కనుక మోకాలు చిప్పలు పగల్లేదు’’ అంది కాంతమ్మ పెద్ద ప్రమాదం తప్పినందుకు సంతోషిస్తూ.
‘‘చంపస్వరాల్ని వాడేటప్పుడు వాహనాలు నడపకూడదు. నడిచేవాళ్ళకు ఇబ్బంది కలిగిస్తూ స్కూటర్లనీ, ఆటోలనీ రోడ్లకడ్డంగా ఆపుకొని, అదేదో మహారాజయోగం అయినట్లుగా భావించుకొని పిచ్చి మొహాలేసుకొని, స్టయిల్‌గా అడ్డమైన చెత్తంతా అవతల వాళ్ళతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం. నాలాంటి వాళ్ళు తీసుకొనే జాగ్రత్తల్ని చూసి మెంటలోళ్ళనుకుంటారు. వాళ్ళంతా మహా మేధావులైనట్లు. ఇప్పుడేమంటావ్ కాంతం’’ అన్నారు అహోబిలంగారు.
‘‘అనేందుకేముందీ, ఇప్పుడీ అవతారాలతో పెళ్లికెలా వెళ్తాం. ఇంటికి పోదాం పదండి’’ అంది కాంతమ్మ.
అదే సమయంలో ఒక స్కూటరుమీద భారత, భాగవతాలూ, మరో స్కూటరుమీద ద్రౌపది, సత్యభామలు అక్కడ ఆగారు. వాళ్ళు వాళ్ల పనులు చూసుకొని, పెళ్లి గురించే డైరెక్టుగా వస్తున్నారు.
ఏమైందని ఆదుర్దాగా అడిగినవాళ్ళకు విషయం వివరించారు.
‘‘మీరిలా వెళ్ళడం బాగోదు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేం వెళ్తాంలెండి. వాళ్ళకెలాగోలా సర్ది చెప్తాం’’ అన్నాడు భారతం.
‘‘ఆ చంపస్వరాలు తీసి మీ హ్యాండ్ బ్యాగుల్లో వేసుకోండి’’ అంది కాంతమ్మ కూతుళ్ళ చేతుల్లోని సెల్స్ చూసి. వాళ్ళు వెంటనే బ్యాగ్‌లో వేసుకున్నారు మారు మాట్లాడకుండా. ఒక స్కూటరుమీద భారతం, అహోబిలం ఎక్కారు. మరో స్కూటరుమీద ద్రౌపది, కాంతమ్మ ఎక్కారు. స్కూటర్లు కదిలాయి. భాగవతం, సత్యభామ కాలినడకన కల్యాణమండపం వైపు సాగారు.
*
-అయిపోయంది

-షణ్ముఖశ్రీ