అనంతపురం

గృహ నిర్మాణాల్లో అంతా ఆర్భాటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూలై 5: అందరికీ గృహాలు నిర్మిస్తామనే ప్రభుత్వ ప్రచారం ఆర్భాటానికే పరిమితమని సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇందులో అర్బన్ విషయానికి వస్తే రాజీవ్ కాలనీలోనే 986 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారన్నారు. అన్ని ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ చేపట్టారో స్థానికులకే అర్థం కావడం లేదన్నారు. సంచార జాతుల వారికి 40 ఇళ్లు మాత్రమే కట్టించి ఇచ్చారన్నారు. అర్బన్‌లో 9 వేల మందికి పైగానే గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రచారానికే ఇళ్ల పథకం వాడుకుంటున్నారు తప్ప నిజంగా అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. ఏళ్లతరబడి గుడిసెల్లో ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రం, రాష్ట్రంలో నయవంచక పాలన
* సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు
అనంతపురం కల్చరల్, జూలై 5: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నయవంచక పాలన సాగిస్తున్నాయని, వీటికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం సీపీఎం శిక్షణా తరగతులకు హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేయకుండా పంటలకు మద్దతు కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాయలసీమలో వేరుశెనగ సాగు అధికంగా ఉంటుందని, దీనికి ఫసల్ బీమా, మద్దతు ధర లేదని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని నిలదీయలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్టల్రో కూడా రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఏళ్లతరబడిగా వీఆర్‌ఏలు, అంగన్‌వాడీలు, హోంగార్డుల సంక్షేమాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో కొద్ది వేతనాలు పెంచి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. ఇటువంటి నయవంచక విధానాలపై సీపీఎం పోరాటాలు సాగిస్తుందన్నారు.