అనంతపురం

అనధికార లేఔట్లలో నిర్మాణాలకు అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, జూలై 5: అహుడా పరిధిలో అనధికార లేఔట్లలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వమని అహుడా వైస్ చైర్మన్ పి.ప్రశాంతి తెలిపారు. గురువారం స్థానిక అహుడా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్లానింగ్ ఆఫీసర్ మోహన్‌కుమార్, ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్స్‌మెన్ చంద్రమ్మ, లైసెన్స్డ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ ప్రశాంతి మాట్లాడుతూ అనధికార లేఔట్లలో వెంచర్లు వేస్తుంటే మా దృష్టికి తీసుకురావాలని ఇంజినీర్లను కోరారు. సిబ్బంది కొరత కారణంగా వాటిపై దృష్టి పెట్టలేకపోతున్నామన్నారు. అనధికార లే ఔట్లను వేసి ప్రభుత్వాదాయానికి గండికొడితే సహించమని స్పష్టం చేశారు. కావున ఇంజినీర్లు అహుడా సిబ్బందికి తమవంతు సహకారం అందించాలన్నారు. అనధికార లేఔట్లను ఉపేక్షించబోమని వాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వాటిని ప్రోత్సహించే పంచాయతీ కార్యదర్శులపై కూడా శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. లైసెన్స్డ్ ఇంజినీర్లు ప్లాన్లను రెగ్యులర్‌గా అందించాలన్నారు. టెక్నికల్ లైసెన్సు కలిగిన వారికి అవసరమైన సాంకేతిక నైపుణ్యత అభివృద్ధికి శాఖాపరంగా సహకారం అందిస్తామన్నారు. అనధికార నిర్మాణాలను చూసీ చూడనట్లు వదలివేస్తే వాటి పరిధిలోని బాధ్యులైన పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే వారంలో పంచాయతీ కార్యదర్శులతో విస్తృత సమావేశం నిర్వహిస్తామన్నారు.

పోలింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి
అనంతపురం సిటీ, జూలై 5: జిల్లాలోని 3,562 పోలింగ్ కేంద్రాలను తప్పనిసరిగా పోలింగ్ అధికారులు తనిఖీ చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్సు హాల్ నుండి జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లుకు అనుకూలంగా వుండేటట్లు వౌళిక వసతులు ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల పేరు మార్పుకానీ, ఒకచోట నుండి మరోచోటుకు మార్చడానికి, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలనందు 110 ఓటర్లుకు మించి వుంటే విభజించాలన్నారు. అలాగే అర్బన్ ప్రాంతంలో 1300 మంది ఓటర్లు వున్న పోలింగ్ కేంద్రాలను కూడా విభజించాలన్నారు. మొత్తం ప్రతిపాదనలు చేసి కలెక్టర్ కార్యాలయానికి ఈ నెల 12వ తేదీన అందజేయాలన్నారు.